Begin typing your search above and press return to search.

మీమ్స్ రాయుళ్లపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్.. ఏమన్నాడంటే??

By:  Tupaki Desk   |   2 April 2021 6:45 AM GMT
మీమ్స్ రాయుళ్లపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్.. ఏమన్నాడంటే??
X
తెలుగు చిత్రపరిశ్రమలో మ్యూజిక్ పరంగా ట్రోల్స్ ఎక్కువగా ఫేస్ చేసేది తమన్ మాత్రమే. ఎందుకంటే అతను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు కానీ ఆ సినిమాలకంటే ట్రోల్స్ ఎక్కువగా పాపులర్ అవ్వడం గమనార్హం. తమన్ ఏ సినిమా చేసినా ఈ మధ్యకాలంలో ఏ సన్నివేశంలో బాక్గ్రౌండ్ మ్యూజిక్ దొరుకుతుందా.. లేక ఏ సినిమాలో ఏ కాపీ సాంగ్ దొరుకుంతుందా అని వెతుకుతుంటారు. అవును నిజంగానే కాపీ సాంగ్స్ చేసాడు. కానీ వాటి గురించి తమన్ పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే ఆ సాంగ్స్ రావడానికి కారణం సినిమా దర్శకులే కాబట్టి అని ఇదివరకు చెప్పాడు. ఎంత కాపీ సాంగ్ అయినా డైరెక్టర్ మాటలేనిదే ఫైనల్ కాదు కదా అని చెప్పుకొచ్చాడు.

కానీ ఆ మధ్య తమన్ చేసిన ఓ సమాధానం ప్రస్తుతం ట్రోలర్స్ కి అద్భుతమైన అవకాశంగా మారింది. 'నేను సాంగ్స్ కాపీ కొడితే మా అమ్మ నాకు అన్నం పెట్టదు' అని ఇదివరకు ట్రోల్స్ పై స్పందించాడు. అదే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మరోసారి ట్రోల్స్ పై స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 'మీమ్స్ చేసేవారు ముందు వారు చేసే పనికి వాళ్ళమ్మ అన్నం పెడుతుందా లేదా అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత మా అమ్మ అన్నం పెట్టడం గురించి మాట్లాడాలి' అని ఘాటుగానే చెప్పాడు. ప్రస్తుతం తమన్ మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉండగా.. తమన్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. సర్కారు వారి పాట, బిబి3, టక్ జగదీష్ సినిమాలు చేస్తూనే తాజాగా వైల్డ్ డాగ్ సినిమాకు బాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. అలాగే తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.