Begin typing your search above and press return to search.

#AA19: డప్పు కొట్టడం మొదలెట్టిన థమన్!

By:  Tupaki Desk   |   23 Jun 2019 12:50 PM GMT
#AA19: డప్పు కొట్టడం మొదలెట్టిన థమన్!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాను #AA19 అని పిలుచుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ కూడా వచ్చింది.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు థమన్ గతంలో 'రేస్ గుర్రం'.. 'సరైనోడు' లాంటి చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించి ఉండడంతో ఈసారి కూడా అదే ఫీట్ రిపీట్ చేస్తాడనేఅంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే గురూజీ త్రివిక్రమ్ సినిమాకు సంగీతం అందించడం థమన్ కు ఇది రెండోసారి. గతంలో 'అరవింద సమేత'కు సంగీతం అందించినప్పటికీ దానికి మాస్ ట్యూన్స్ ఇచ్చే ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో థమన్ కు మ్యూజిక్ పరంగా రిస్ట్రిక్షన్స్ ఉండకపోవచ్చు. ఈ సినిమాకు ప్రస్తుతం మ్యూజిక్ అందించే పని జోరుగా సాగుతోందట.

ఈ విషయాన్ని తెలుపుతూ థమన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా "#AA19 మ్యూజిక్ అందించే ప్రాసెస్ లో ఉన్నాం. మాస్టర్ ఆఫ్ రైటింగ్ త్రివిక్రమ్ సర్.. & మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్" అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటుగా త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో కలిసి ఉన్న ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ అప్డేట్ ఫుల్ జోష్ ఇచ్చింది.