Begin typing your search above and press return to search.

పవన్ కోసం తమన్.. సిట్టింగులు స్టార్ట్

By:  Tupaki Desk   |   17 Dec 2016 11:18 AM IST
పవన్ కోసం తమన్.. సిట్టింగులు స్టార్ట్
X
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు యాక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. జనవరి నెలాఖరుకు పూర్తి కానుంది. ఆ వెంటనే త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టనున్న పవర్ స్టార్.. దీంతో పాటే కోలీవుడ్ మూవీ వేదాలం రీమేక్ లో కూడా నటించనున్నాడు.

తమిళ్ డైరెక్టర్ ఆర్ టీ నేసన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించనున్నాడు. పవన్ తో తొలిసారిగా థమన్ జట్టు కట్టిన మూవీ ఇది. అందుకే అటు పవన్ అభిమానులకు.. ఇటు తనకు మెమరబుల్ గా ఉండిపోయేలా అద్భుతమైన సంగీతం అందించేందుకు సిద్ధమవుతున్నాడు థమన్. ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉన్నా.. ఇప్పటికే డైరెక్టర్ నేసన్ తో కలిసి మ్యూజికి సిట్టింగ్స్ స్టార్ట్ చేసేయడం విశేషం.

అనతి కాలంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగినా.. థమన్ కు పలు విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. అందుకే పవర్ స్టార్ మూవీకి పవర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చి.. తనపై వచ్చిన ఆరోపణలు అన్నిటికీ ఒకటే సమాధానం చెప్పాలని భావిస్తున్నాడట ఈ కంపోజర్. యాక్షన్ డ్రామా జోనర్ లో తెరకెక్కే ఈ మూవీకి.. థమన్ డిఫరెంట్ గా మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/