Begin typing your search above and press return to search.

మొత్తానికి త‌మన్ గెలిచేశాడు

By:  Tupaki Desk   |   22 Dec 2021 8:00 AM IST
మొత్తానికి త‌మన్ గెలిచేశాడు
X
టాలీవుడ్ లో ఫైటింగ్స్ అనేవి అన్ని విభాగాల్లో ఉంటాయి. అయితే అది స్వీటెస్ట్ ఫైట్. ఒక రకమైన ఆరోగ్యకరమైన పోటీగా చెబుతారు. ఇక టాలీవుడ్ లో ఇద్దరు యంగ్ మ్యుజీషియన్స్ మధ్యన ఫైట్ ఎపుడూ ముచ్చటగానే ఉంటూ వస్తోంది. ఆ ఇద్దరే దేవీశ్రీ ప్రసాద్, త‌మన్. ఈ ఇద్దరూ టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేస్తున్నారు.

ఈ ఇద్దరిలో ఇపుడు త‌మన్ దూకుడు అయితే మామూలుగా లేదు. ఆయన ఏ ముహూర్తాన అల వైకుంఠపురంలో అని అన్నాడో తెలియదు కానీ నాటి నుంచి రేంజి అయితే ఒక్కసారిగా మారిపోయింది. 2020 సంక్రాంతికి వచ్చిన ఈ మూవీతో త‌మన్ అద్భుతమైన అప్లాజ్ ని సాధించేశారు. ఈ మూవీతో పోటీగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చారు. కానీ చివరికి త‌మన్ ఒక అంచు పైన నిలబడి సత్తా చాటారు.

ఆ తరువాత క్రాక్ మూవీతో ఈ ఏడాది సంక్రాంతికి మరో హిట్ కొట్టి ఇంకో మెట్టు ఎక్కేశారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో అదరహో అనిపించేశారు. ఇపుడు చూస్తే అఖండ మూవీతో బాలయ్యతో ఫస్ట్ కాంబోతోనే రీసౌండ్ చేశారు. తమన్ కేవలం సాంగ్స్ కి మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా సూపర్ అనిపించేసుకున్నారు. అఖండ సూపర్ డూపర్ సక్సెస్ లో తమన్ పాత్ర చాలా కీలక‌మనే చెప్పాలి.

రీ రికార్డింగ్ అదరగొట్టేశారు. బోయపాటి ఎలివేషన్స్ కి ప్రాణం పోశారు. బాలయ్య రోరింగ్ యాక్షన్ ని ఎన్నో హైట్స్ కి తీసుకెళ్లారు. ఈ మూవీ వంద కొట్ల క్లబ్ లో చేరడం వెనక తమన్ కృషి చాలా ఉంది అంతా ఒప్పుకునే పరిస్థితి ఉంది. ఇదే టైమ్ లో దేవీశ్రీ ప్రసాద్ పుష్ప మూవీతో రేసులోకి వచ్చినా కూడా అఖండ మ్యూజికల్ ఫీట్ ముందు కొంత తగ్గాడనే అంటున్నారు. ముఖ్యంగా పుష్ప మూవీ ఆడియో పెర్ఫెక్షన్ కంటే అఖండకే మార్కులు ఎక్కువగా పడ్డాయని అంటున్నారు.

తమన్ తన ఊపుని అలా కంటిన్యూ చేస్తున్నాడు. వచ్చే ఏడాది బీమ్లా నాయక్ మరో మారు మాస్ లో సందడి రేపనున్నారు. . బాలయ్య గోపీచంద్ మలినేని మూవీకి కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు. అలాగే అనేకమైన క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. మొత్తానికి తమన్ మాత్రం గెలిచేశాడు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో సీనియర్లకు చేరువలో ఉంటూ సత్తా చాటుకున్నాడని టాక్ అయితే ఉంది.