Begin typing your search above and press return to search.

తమన్ మోత మోగించాడుగా..

By:  Tupaki Desk   |   23 Oct 2017 9:40 AM IST
తమన్ మోత మోగించాడుగా..
X
ఒకే తరహా మ్యూజిక్ ఇస్తున్నాడంటూ ఆమధ్య విమర్శలు మూటగట్టుకున్న ఈ మధ్య ట్రెండ్ మార్చాడు. స్టయిల్ మార్చి కొత్త తరహా సంగీతంతోనూ మ్యూజికల్ హిట్స్ కొడుతున్నాడు. దీంతో తమన్ కు తిరిగి అవకాశాలు తెగ వచ్చేస్తున్నాయి. రీసెంట్ గా మహానుభావుడుతో మరో హిట్ ఖాతాలో వేసుకున్న తమన్ పేరు బాలీవుడ్ లోనూ మారుమోగుతోంది.

బాలీవుడ్ లో కామెడీ చిత్రాలతో పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టి దర్శకత్వంలో గోల్ మాల్ అగైన్ ఈ దీపావళికి థియేటర్లకు వచ్చింది. అజయ్ దేవగన్ హీరోగా రోహిత్ శెట్టి డైరెక్గన్ లో ఇంతవరకు గోల్ మాల్ సిరీస్ లో మూడు సినిమాలొచ్చాయి. ఇప్పుడొచ్చిన గోల్ మాల్ అగైన్ సినిమాకు మ్యూజిక్ ఇచ్చింది తమన్. గోల్ మాల్ అగైన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ రూ. 100 కోట్ల కలెక్షన్ దిశగా దూసుకుపోతోంది.

గోల్ మాల్ అగైన్ సినిమాలో పాటలన్నీ హిందీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. దీంతో ముందుముందు బాలీవుడ్ నుంచి తమన్ కు మరిన్ని పిలుపులొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన జవాన్ సినిమాకు సంగీతం అందించాడు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న భాగ్ మతి - నితిన్ తర్వాత సినిమాకు కూడా తమనే మ్యూజిక్ అందించనున్నాడు.