Begin typing your search above and press return to search.

ట్వీట్ కలిపావ్ తమనూ.. ట్రాక్స్ కూడానా?

By:  Tupaki Desk   |   1 Feb 2018 10:04 AM IST
ట్వీట్ కలిపావ్ తమనూ.. ట్రాక్స్ కూడానా?
X
ఒకే రోజున ఒక కంపోజర్ సంగీతం అందించిన రెండు సినిమాలు విడుదల కావడం పెద్ద వింతేమీ కాదు కానీ.. టాప్ లిస్ట్ లో ఉన్నవారికి ఇలా అరుదుగానే జరుగుతుంది. స్టార్స్ నుంచి చిన్న సినిమాల వరకు.. తన స్టైల్ లో ట్యూన్స్ అందించడంలో దిట్ట అయిన తమన్.. వచ్చే వారం విడుదల కానున్న 4 సినిమాల్లో మూడింటికి తానే కంపోజ్ చేస్తున్నాడు.

వరుణ్ తేజ్ తొలిప్రేమ.. సాయి ధరం తేజ్ ఇంటెలిజెంట్.. మోహన్ బాబు గాయత్రి చిత్రాలకు సంగీతం అందిస్తున్నది తమనే. తొలిప్రేమ.. ఇంటెలిజెంట్ చిత్రాలు ప్రస్తుతం రీ-రికార్డింగ్ దశలో ఉన్నాయి. అదే విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించాడు ఈ కంపోజర్. ఫుల్ స్పీడ్ లో సంగీతం అందించగల ట్యాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ కు గుర్తింపు ఉంది. రెండు సినిమాలకు ఒకేసారి పని చేస్తున్నట్లు చెప్పిన తమన్.. సెంటెన్స్ ను కూడా భలే ఫామ్ చేశాడు. 'తొలిప్రేమతో ఇంటెలిజెంట్ గా పని జరుగుతోంది' అంటూ అసలు విషయం చెప్పాడు తమన్.

అంతా బాగానే ఉంది కానీ.. పెద్ద సినిమాల విషయంలో అయితే ఇలాంటి ప్రయోగాలు చేయడం అసాధ్యం. తొలిప్రేమ.. ఇంటెలిజెంట్.. రెండూ మీడియం బడ్జెట్ మూవీస్ మాత్రమే. తమన్ చేసిన సినిమాలతో పోల్చితే.. ఇవి రెండూ చిన్న సినిమాలే కావచ్చు. కానీ ఒకేసారి రెండు సినిమాలకు పని చేసేయడం అంటే.. రెండిటి ట్రాక్స్ కూడా కలిపేస్తాడా ఏంటి అనుకోవచ్చు. కానీ అది సాధ్యం కాదు లెండి. ఎందుకంటే ఒకటి ప్యూర్ లవ్ స్టోరీ.. మరొకటి పక్కా మాస్ ఎంటర్టెయినర్. తమన్ కలిపేద్దామన్నా.. పులిహోర- బిర్యానీ కలవవు కదా.