Begin typing your search above and press return to search.

బుట్టబొమ్మ పాటపై థమన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   6 May 2020 2:21 PM IST
బుట్టబొమ్మ పాటపై థమన్‌ షాకింగ్‌ కామెంట్స్‌
X
ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం సెన్షేషనల్‌ సక్సెస్‌ ను దక్కించుకుని ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచిన విషయం తెల్సిందే. అల్లు అర్జున్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాకు థమన్‌ సంగీతాన్ని అందించాడు. సినిమాలోని అన్ని పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా బుట్ట బొమ్మ పాట.. ఆ పాట స్టెప్పులు ఎంతటి ఫేమస్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అంతర్జాతీయ స్థాయికి బుట్టబొమ్మ వెళ్లింది. విదేశీయులు కూడా బుట్టబొమ్మ పాటకు టిక్‌ టాక్‌ వీడియోలు చేశారు. బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా బుట్టబొమ్మ స్టెప్పులతో మెప్పించారు. అంతటి సక్సెస్‌ అయిన బుట్టబొమ్మ పాట గురించి సంగీత దర్శకుడు థమన్‌ తాజాగా ఒక మీడియా ఇంట్రాక్షన్‌ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదట అనుకున్న అల వైకుంఠపురం ఆల్బంలో బుట్టబొమ్మ పాటలేదన్నాడు.

పాటలన్నీ పూర్తి అయిన తర్వాత రీ రికార్డింగ్‌ చేస్తున్న సమయంలో ఒక పాటను తొలగించి బుట్టబొమ్మ పాటను ఖరారు చేశాం. మూడు రోజుల్లోనే పూర్తి పాటను పూర్తి చేయడం ఛాలెంజ్‌ విషయం. అయినా కూడా బుట్టబొమ్మను మార్చాం. ఈ పాట ఇంతటి హిట్‌ అవ్వడంకు 50 శాతం కారణం నేను అయితే మిగిలిన 50 శాతం సక్సెస్‌ క్రెడిట్‌ ఖచ్చితంగా బన్నీదే అంటూ థమన్‌ అన్నాడు. అల వైకుంఠపురంలో హిట్‌ తో ప్రస్తుతం థమన్‌ తెలుగు మరియు తమిళ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ అయ్యాడు.