Begin typing your search above and press return to search.

'క్రాక్' ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని రిలీజ్ చేస్తున్న థమన్..!

By:  Tupaki Desk   |   4 Jan 2021 10:15 AM IST
క్రాక్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని రిలీజ్ చేస్తున్న థమన్..!
X
మాస్ మహారాజ్ రవితేజ - మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ లది హిట్‌ కాంబినేషన్‌ అనే విషయం తెలిసిందే. ఇప్పటివరకూ వీళ్లిద్దరి కలయికలో పది సినిమాలు వచ్చాయి. తాజాగా వీరి కాంబోలో 11వ చిత్రంగా ‘క్రాక్‌’ వస్తోంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌ పై ఠాగూర్ మధు నిర్మించారు. వాస్తవ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన ఈ రవితేజ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించగా.. ఆయనకు జోడీగా శృతి హాసన్ నటించింది. సంక్రాంతి కానుక ఈ చిత్రాన్ని జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం కోసం థమన్ పక్కా మాస్‌ మసాలా సాంగ్స్ ఇచ్చినట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే విడుదలైన ‘భూమ్‌ బద్దలు’ ‘భలేగా తగిలావే బంగారమ్‌’ ‘కోరమీసం పోలీసోడు’ వంటి పాటలు ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో 'క్రాక్' ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని కూడా రిలీజ్ చేయడానికి థమన్ సన్నాహాలు చేస్తున్నారు.

థమన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. 'క్రాక్' బీజీఎమ్ నుంచి స్మాల్ గ్లిమ్స్ ని షేర్ చేసిన థమన్.. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న క్రాక్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. 2020 సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' సినిమాకి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించి ఆ సినిమా విజయంలో మేజర్ రోల్ ప్లే చేసిన థమన్.. 2021 సంక్రాంతికి 'క్రాక్' తో భారీ విజయం అందుకుంటాననే నమ్మకంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన సాంగ్స్ తో పాటు ‘క్రాక్‌ బిర్యానీ’ అనే మరో మాస్ సాంగ్ ని ఈరోజు సోమవారం విడుదల చేస్తున్నారు. ఈ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాకి తగ్గట్టే థమన్ హైరేంజ్‌ మాస్ కమర్షియల్‌ ఆల్బమ్‌ అందించినట్లు అర్థం అవుతోంది. రవితేజ - థమన్ - గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ''క్రాక్'' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.