Begin typing your search above and press return to search.
'వకీల్ సాబ్' ని పైకి లేపిన థమన్..!
By: Tupaki Desk | 9 April 2021 5:24 PM ISTప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు ఎస్.ఎస్.థమన్. సాంగ్స్ తో పాటుగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇస్తాడనే పేరు తెచ్చుకున్న థమన్.. కేవలం తన సంగీతంతోనే చాలా సినిమాలను సక్సెస్ బాట పట్టించాడు. అయితే ఎన్ని మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా థమన్ మీద కాపీ క్యాట్ అంటూ ట్రోల్స్ వస్తుంటాయి. అయినప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఫస్ట్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి సంగీతం అందించే అవకాశం దక్కించుకున్నాడు. అది కూడా పవన్ రీ ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' కావడంతో థమన్ రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేసాడు.
ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' సినిమాకి మంచి ఆల్బమ్ అందించాడు థమన్. ఆయన కంపోజ్ చేసిన 'మగువా మగువా' 'సత్యమేవ జయతే' 'కనుపాపా' 'కదులు కదులు' పాటలు రిలీజ్ కి ముందే హిట్ అయ్యాయి. అయితే ఈరోజు సినిమా విడుదలయ్యాక అందరూ థమన్ అందించిన నేపథ్య సంగీతం గురించి మాట్లాడుకుంటున్నారు. సాంగ్స్ తో పాటుగా బ్యాగ్రౌండ్ స్కోర్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన థమన్.. ఈ సినిమాని పైకి లేపాడని ప్రశంసలు అందుకుంటున్నాడు. పవన్ ని ఎలివేట్ చేసే సీన్స్ లో అతను ఇచ్చిన బీజీఎమ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో మొన్నటి దాకా ట్రోల్ చేసిన వాళ్లే ఇప్పుడు పొగిడేలా చేసుకున్నాడు. ఇకపోతే ఈ ఏడాది 'క్రాక్' 'వైల్డ్ డాగ్' వంటి చిత్రాలకు మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసాడని పేరు తెచ్చుకున్న థమన్.. 'వకీల్ సాబ్' తో మరోసారి తన సత్తా చాటాడని చెప్పవచ్చు.