Begin typing your search above and press return to search.

లండన్ లో 'లూసిఫర్' సాంగ్ రికార్డింగ్.. కల నిజమైందంటున్న థమన్..!

By:  Tupaki Desk   |   26 July 2021 5:30 PM GMT
లండన్ లో లూసిఫర్ సాంగ్ రికార్డింగ్.. కల నిజమైందంటున్న థమన్..!
X
'ఆచార్య' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను తెరకెక్కించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుందని దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. 'బ్రూస్ లీ' సినిమాలో చిరంజీవి ఎంట్రీ కి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన తమన్.. మొదటిసారి పూర్తి సినిమాకి వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే మోహన్ రాజాతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టేసాడు. ఈ క్రమంలో తాజాగా మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ అందించారు.

#Chiru153 కోసం ఫస్ట్ సాంగ్ కంపోజింగ్ ను లండన్ లో మొదలు పెట్టినట్లు థమన్ వెల్లడించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ స్టూడియోలో ఇన్స్త్రమెంట్స్ తో పని చేస్తున్న ఓ ఫోటోని షేర్ చేశారు. ''ఇది నా లైఫ్ లో బిగ్ డే. నా కల నెరవేరిన రోజు. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కోసం ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ చేస్తున్నా. లండన్‌ లోని అబ్బె రోడ్ స్టూడియోలో 60 ఫిల్ గ్రాండ్ హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఈ పాటను కంపోజ్ చేస్తున్నాను. సెలెబ్రేషన్స్ చేసుకోవాల్సిన సమయమిది. మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటే ఆచరణ అంతగా గొప్పగా ప్రభావాన్ని చూపుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మోహన్ రాజాకు ధన్యవాదాలు. మనమంతా కలిసి మన మెగాస్టార్ #Chiru153 ని సెలెబ్రేట్ చేద్దాం'' అని థమన్ ట్వీట్ చేశారు. దీనికి మోహన్ రాజా స్పందిస్తూ.. ''మా మెగా ప్రయాణంలో సోదరుడు థమన్ తో కలిసి చేసే ఈ ప్రాసెస్ చాలా బాగుంది. #Chiru153 షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది'' అని అన్నారు

కాగా, #Chiru153 చిత్రాన్ని వచ్చే నెల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సెట్స్ మీదకు తీసుకెళ్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే దీని కోసం ఓ భారీ సెట్ నిర్మాణాన్ని చేపట్టారు. ‘ఆచార్య’ సినిమా కోసం అద్భుతమైన టెంపుల్ టౌన్ సెట్ ఏర్పాటు చేసిన సురేష్‌ సెల్వరాజన్.. 'లూసిఫర్‌' రీమేక్‌ కోసం ఈ సెట్ ను నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ - ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ పై ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఆర్.బి. చౌదరి - ఎన్.వి.ప్రసాద్ - పరాస్ జైన్ మరియు వాకాడ అప్పారావ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.