Begin typing your search above and press return to search.
సీక్వెల్.. నేను రెడీ అంటున్న తమన్
By: Tupaki Desk | 13 Jan 2022 3:58 PM ISTనందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన మూడవ చిత్రం అఖండ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అఖండ సూపర్ హిట్ లో సంగీత దర్శకుడు తమన్ పాత్ర కచ్చితంగా ఉందనడంలో సందేహం లేదు. తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది అంటూ విశ్లేషకులు మరియు సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలయ్య మాస్ యాక్షన్ కు తమన్ మాస్ బీట్స్ తో యాక్షన్ సన్నివేశాలు పిక్స్ లో ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నందమూరి అభిమానులకు ఫుల్ మాస్ మసాలా మ్యూజిక్ ను ఇచ్చిన తమన్ కు మంచి ప్రశంసలు అఖండ ద్వారా దక్కాయి అనడంలో సందేహం లేదు.
బాలకృష్ణ మరియు తమన్ కాంబినేషన్లో ముందు ముందు మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల తమన్ మాట్లాడిన సందర్భంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ మరియు బోయపాటి కాంబోలో మరో సినిమా కూడా త్వరలోనే రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఆ మరో సినిమా అఖండ కు సీక్వెల్ గా రూపొందనుంది అని దర్శకుడు బోయపాటి శ్రీను ఇటీవలే పేర్కొన్నాడు. అఖండ కు కచ్చితంగా సీక్వెల్ అంటూ ఆయన చేసిన ప్రకటన ప్రస్తుతం సినీ వర్గాల వారికి మరియు నందమూరి అభిమానులకు సంతోషం కలిగిస్తుంది. సూపర్ హిట్ సినిమా సీక్వెల్ అంటే ప్రతి ఒక్కరికి కూడా కచ్చితంగా ఆసక్తి ఉంటుంది.
అలాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. అందుకే సీక్వెల్ ప్రకటించిన వెంటనే నేను సిద్ధం అన్నట్లుగా తమన్ ప్రకటించాడు. బోయపాటి అఖండ సీక్వెల్ ను ప్రకటించడం... తమన్ నేను రెడీ అన్నట్లుగా ఒక మీమ్ పోస్టర్ సోషల్ మీడియాలో చేరింది. ఆ మీమ్ పోస్టర్ ను రీట్వీట్ చేసి తాను సిద్ధం అని అన్నట్లుగా బోయపాటికి మరియు బాలకృష్ణకు తమన్ ఒకే చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమాల తర్వాత అఖండ సీక్వెల్ ను మొదలు పెట్టే అవకాశం ఉంది. బాలయ్య ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను మొదలు పెట్టాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాను చేయాల్సి ఉంది. ఆ రెండు సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుంది. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ తో బోయపాటి ఒక సినిమా చేయబోతున్నాడు. అంటే బాలయ్య అఖండ సీక్వెల్ ని మనం చూడాలంటే మరో మూడేళ్లు అయినా వేచిచూడాల్సి ఉంటుందేమో. అఖండ సీక్వెల్ కు తమన్ మాస్ మోత వినాలంటే మూడేళ్లు వేచి చూడలన్నమాట.