Begin typing your search above and press return to search.

శిరీష్ ను ఇబ్బంది పెడుతున్న తమన్

By:  Tupaki Desk   |   10 March 2016 7:30 AM GMT
శిరీష్ ను ఇబ్బంది పెడుతున్న తమన్
X
గౌరవం - కొత్తజంట సినిమాలు వరుసగా నిరాశ పరచడంతో... ఈసారి ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీని తీయడానికి సిద్ధమయ్యాడు అల్లు శిరీష్. లావణ్య త్రిపాఠితో కలిసి ఇందులో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాలేజీ స్టూడెంట్ గా నటిస్తున్నాడు అల్లు శిరీష్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ‘శ్రీరస్తు.. శుభమస్తు’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. అయితే మూడు పాటల బ్యాలెన్స్ మాత్రం ఇంకా మిగిలేవుంది.

ఈ మూడు పాటలు ఇప్పటి వరకు రికార్డు కూడా కాలేదట. తమన్ ట్యూన్స్ ఇవ్వకపోవడంతో లిరిక్స్ కూడా ఇంకా రాయలేదు. దాంతో పాటలే ఇప్పటి వరకు రికార్డు చేయలేదట. ఈ మూడు పాటలను థమన్ ఎప్పుడెప్పుడు ఇస్తాడా అని ఈ అల్లు వారబ్బాయి వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే... సమ్మర్ లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. అయితే థమన్ ఇప్పటికీ పాటల ట్యూన్స్ ను ఇవ్వక పోవడంతో ఈ సినిమా ఫినిషింగ్ ఆలస్యం అవుతోందట. మరి ఇప్పటికైనా థమన్ మేలుకొని ఆ మూడు ట్యూన్స్ ఇచ్చేస్తాడా లేక మరింత ఆలస్యం చేస్తాడా అనేది చూద్దాం.