Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ ని గెలిచిన థ‌మ‌న్..అందుకే రాజాకే రైట్ రైట్!

By:  Tupaki Desk   |   13 March 2022 3:52 AM GMT
ప్ర‌భాస్ ని గెలిచిన థ‌మ‌న్..అందుకే రాజాకే రైట్ రైట్!
X
మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా థ‌మ‌న్ రెయిజింగ్ లో కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం స్టార్ హీరోల సినిమాల‌న్నింటికి థ‌మ‌న్ కంపోజ‌ర్ అవుతున్నారు. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. అవ‌కాశం..అదృష్టం..ప్ర‌తిభ అన్ని త‌మ‌న్ అలా పైకి తీసుకెళ్లాయి.

నేడు టాలీవుడ్ లో టాప్ లో కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం థ‌మ‌న్ లైన‌ప్ చూస్తే ఏ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అత‌ని బిజీ షెడ్యూల్ ముందు స‌రిపోరు. థ‌మ‌న్ అంత బిజీగా ఉన్నారు. ఇటీవ‌లి కాలంలో థ‌మ‌న్ మ్యూజిక్ అందించిన సినిమాలు క‌మ‌ర్శియ‌ల్ గా మంచి స‌క్సెస్ సాధించ‌డంతో ద‌ర్శ‌క‌-హీరోలంతా థ‌మ‌న్ నే కోరుకుంటున్నారు.

సాక్ష్యాత్తు పాన్ ఇండియా డైరెక్ట‌ర్ శంక‌ర్ రామ్ చ‌ర‌ణ్ 15వ చిత్రానికి థ‌మ‌న్ కి ఏరికోరి మ‌రి ఎంపిక చేసారు. ఏ. ఆర్ రెహ‌మాన్..యువ‌న్ శంక‌ర్ రాజా..హ్యారీస్ జైరాజ్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ ఉన్నా థ‌మ‌న్ ని రంగంలోకి దించారు. అత‌నితో కొత్త‌గా ట్రై చేయాల‌ని శంక‌ర్ పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చారు.

ఈ సినిమా ఆఫ‌ర్ తో థ‌మ‌న్ దేశ వ్యాప్తంగా మ‌రింత పాపులర్ అయ్యారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సైతం థ‌మ‌న్ ని ఏరికోరి త‌దుప‌రి సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా `రాజా డీల‌క్స్` అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి థ‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా లాక్ చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌భాస్ అండ్ కో రిఫ‌రెన్స్ తోనే ఈ ఛాన్స్ అందుకున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ప్ర‌భాస్ ఎంపిక చేయ‌డం వెనుక ప్ర‌త్యేక కార‌ణాలున్నాయి.

గ‌తంలో ప్ర‌భాస్ న‌టించిన `సాహో` సినిమా టీజ‌ర్ కి అద్భుత‌మైన బీజీఎమ్ కంపోజ్ చేసారు త‌మ‌న్. ఆ టీజ‌ర్ లో బీజీఎమ్ హైలైట్ అయింది. త‌మ‌న్ లో ఆ క్రియేటివిటీ చూసే ఇటీవ‌ల విడుద‌లైన `రాధేశ్యామ్` చిత్రానికి మ‌రోసారి బీజీఎమ్ కంపోజ్ చేసే అవ‌కాశం క‌ల్పించారు.

అలా ప్ర‌భాస్ పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని థ‌య‌న్ రెండుసార్లు నిల‌బెట్టుకున్నారు. దీంతో మూడ‌వ సినిమా `రాజా డీల‌క్స్` మ్యూజిక్ బాధ్య‌త‌ల‌న్నింటిని థ‌మ‌న్ చేతుల్లోనే పెట్టిన‌ట్లు తెలుస్తోంది. హారర్ కామెడీ గా రూపొందుతున్న `రాజా డీల‌క్స్` షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం డార్లింగ్ 50 రోజులు డేట్లు కేటాయించారు.

రెండు షెడ్యూల్లోనే షూటింగ్ మొత్తం పూర్తిచేయాల్సిన బాధ్య‌త మారుతి పై ఉంది. ఇందులో హీరోయిన్ల‌గా మాళ‌విక మోహ‌న‌న్-శ్రీలీల న‌టిస్తున్నారు. మూడ‌వ హీరోయిన్ అన్వేష‌ణ కొన‌సాగుతుంది. ప‌లువురు భామ‌ల పేర్లు తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇంకా ఎవ‌ర్నీ ఫైన‌ల్ చేయ‌లేదు. ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.