Begin typing your search above and press return to search.

తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫెస్టివల్

By:  Tupaki Desk   |   19 Sept 2017 10:22 AM IST
తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫెస్టివల్
X
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ కెరీర్ లో త్రిబుల్ ధమాకా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఆ మధ్య వరస ఫ్లాపులతో కాస్త వెనుకబడ్డా తిరిగి రేసులో ముందుకొచ్చేశాడు. ప్రస్తుతం తమన్ కెరీర్ మాంచి పీక్ లో నడుస్తోంది. అందుకు తగ్టట్టే అనుకోకుండా మూడు మెమరబుల్ ఈవెంట్స్ అతడి లైఫ్ లో లైను కట్టేశాయి.

తమన్ మ్యూజిక్ అందించిన మూడు సినిమాల ట్రయిలర్లు వరసపెట్టి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ట్విట్టర్ ద్వారా ఈ హ్యాపీ న్యూస్ తమన్ అభిమానులకు షేర్ చేశాడు. శర్వానంద్ హీరోగా నటించిన మహానుభావుడు సినిమా సినిమా ట్రయిలర్ నిన్ననే (18న) విడుదలైంది. నాగార్జున హీరోగా నటించిన రాజుగారిగది-2 థియేటరికల్ ట్రయిలర్ ఈనెల 20న విడుదల కానుంది. తర్వాత రెండు రోజుల గ్యాప్ లో తమన్ కెరీర్ లో తొలిసారి మ్యూజిక్ అందించిన గోల్ మాల్ అగైన్ ట్రయిలర్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లన్నీ వరసపెట్టి వస్తున్నాయని.. ఇదంతా దేవుడి కరుణేనంటూ ట్వీట్ పెట్టాడు.

తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూడు సినిమాల్లో మహానుభావుడు - గోల్ మాల్ అగైన్ ఎంటర్ టెయినర్లు కాగా.. రాజుగారి గది థ్రిల్లర్. గోల్ మాల్ సిరీస్ లో వస్తున్న నాలుగో చిత్రం గోల్ మాల్ అగైన్. ఇందులో మొదటి చిత్రానికి విశాల్-శేఖర్... రెండు-మూడు చిత్రాలకు ప్రీతమ్ సంగీతం అందించారు. నాలుగో సినిమాకు రోహిత్ శెట్టి తొలిసారి సౌత్ నుంచి తమన్ ను ఎంచుకున్నాడు. వేర్వేరు జోనర్లు.. వేర్వేరు భాషల్లో ఒకేసారి తన మ్యూజిక్ తో మెప్పించడానికి తమన్ రెడీ అయిపోయాడు.