Begin typing your search above and press return to search.

థియేటర్స్ లో పూనకాలే అంటున్న మ్యూజిక్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   28 Dec 2019 9:58 AM GMT
థియేటర్స్ లో పూనకాలే అంటున్న మ్యూజిక్ డైరెక్టర్
X
సంక్రాంతి బరిలో రెండు బడా సినిమాలు నిలిచాయి. దీంతో ఈ సినిమాల నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ వాటిని ఎంజాయ్ చేస్తూ తమ హీరో ఈసారి గట్టిగా కొట్టడం ఖాయమనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే తాజాగా బన్నీ సినిమాకు సంబంధించి తమన్ ఓ పోస్ట్ పెట్టి అల్లు ఫ్యాన్స్ ను రెచ్చగొట్టాడు. "ఓ మై గాడ్ డాడీ' సాంగ్ ను ఇప్పటికే తొంబై సార్లు చూసాను. ఇప్పుడు వందో సారి చూస్తున్నాను. ఈ సాంగ్ కి థియేటర్స్ లో పూనకాలే. " అంటూ తను పొందిన అనుభూతిని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

దీంతో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో తమన్ పోస్ట్ ను షేర్ చేస్తూ అపోజిట్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ రెచ్చిపోతూ ఆనందపడుతున్నారు. నిజానికి దేవి శ్రీ ప్రసాద్ కూడా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి ఆర్ ఆర్ ఇవ్వడం మొదలెట్టేసాడు. కానీ సినిమా గురించి కానీ, ఫైట్ ఎపిసోడ్ గురించి కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెన్స్ మైంటైన్ చేస్తున్నాడు.

మరి ఇప్పుడు తమన్ ను చూసి దేవి కూడా బరిలోకి దిగి సరిలేరు పోస్ట్ ప్రొడక్షన్ అప్డేట్స్ ఇస్తూ మహేష్ ఫ్యాన్స్ కి బలాన్ని చేకూర్చుతాడేమో చూడాలి. వచ్చే నెలలో సంక్రాంతి బరి లో ఒక రోజు తేడాతో థియేటర్స్ లోకి వస్తున్న ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయం అందుకుంటాయా అనే ఆతృతతో ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు.