Begin typing your search above and press return to search.

సైరా మిస్సయిపోయాడా??

By:  Tupaki Desk   |   8 Dec 2017 12:57 PM GMT
సైరా మిస్సయిపోయాడా??
X
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సైరా సినిమాకు వర్క్ చేసే అవకాశం రావాలని చాలా మంది టెక్నీషియన్స్ ఎదురుచూస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి రామ్ చరణ్ తన తండ్రి సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కమర్షియల్ దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

సినిమాకు కెప్టెన్ దర్శకుడు సురేందర్ రెడ్డి అయినా ప్రతి విషయంలో నిర్మాత రామ్ చరణ్ తన డిసిషన్ ఫైనల్ అయ్యేలా చూసుకుంటున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. సినిమాకి ప్రస్తుతం సంగీత దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. కొన్ని రోజుల క్రితం కీరవాణిని ఒకే చేసే అవకాశం ఉందనే టాక్ బాగా వినిపించింది. కానీ ఆ విషయంలో క్లారిటీ లేదు. ఇక సురేందర్ రెడ్డి - థమన్ కాంబోలో మంచి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకసారి ఏ దర్శకుడికైనా మ్యూజిక్ డైరెక్టర్ తో బాగా కనెక్ట్ అయితే వారితోనే పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే మొదట సైరాకు కూడా థమన్ ని సెలెక్ట్ చేసి టైటిల్ ఫస్ట్ లుక్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పించారు. థమన్ ఆ మ్యూజిక్ కోసం చాలా కష్టపడ్డాడు. కానీ రామ్ చరణ్ మాత్రం బాలీవుడ్ పై కన్నేసి ఏఆర్.రెహమాన్ ఫైనల్ చేశాడు.

కానీ ఆ తర్వాత ఆయన తప్పుకోవడంతో మరోసారి తమన్ పేరు వినిపించింది. కాని మనోడు అవకాశం కోసం ప్రయత్నాలు చేసినా ఏ మాత్రం సక్సెస్ కాలేదట. కాకపోతే చరణ్ తను బోయపాటితో చేయబోయే సినిమాకు అవకాశం ఇస్తానని చెప్పాడట. దీంతో థమన్ చిరంజీవి సినిమాకి చేసే అవకాశాన్ని పొందలేకపోయాడు. మరి సైరాకి సెట్ అయ్యే లక్కీ సంగీత దర్శకుడిని ఎప్పుడు సెలెక్ట్ చేస్తారో ఏమో..