Begin typing your search above and press return to search.

రీమేక్‌ కోసం పవన్‌ పాట?

By:  Tupaki Desk   |   12 Dec 2020 3:30 AM GMT
రీమేక్‌ కోసం పవన్‌ పాట?
X
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ గతంలో చిన్న బిట్‌ సాంగ్స్‌ పాడాడు. ఆ పాటలకు మంచి క్రేజ్‌ దక్కింది. పవన్‌ త్వరలో మరోపాట పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలయాళ సూపర్‌ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' ను సాగర్‌ చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ వారు రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. సినిమాలో పెద్దగా పాటలు ఉండవు. అందుకే సినిమా కోసం ప్రమోషనల్‌ సాంగ్‌ ను మలయాళ హీరోలు అయిన బీజూ మీనన్‌ మరియు పృథ్వీరాజ్‌ లు పాడారు.

ఇప్పుడు రీమేక్ లో పవన్‌ మరియు రానాలు కలిసి నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రానా విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయినా కూడా పుకార్లు మాత్రం షికార్లు చేస్తూనే ఉన్నాయి. పవన్‌ మరియు రానాలతో సంగీత దర్శకుడు పాట పాండించేందుకు ఒక మంచి ట్యూన్‌ ను ఇప్పటి నుండే ప్రిపేర్‌ చేస్తున్నాడట. ఆ పాట కనీసం పదేళ్ల పాటు గుర్తుండేలా పవన్‌ పాడుతున్నాడు కనుక ఒక విభిన్నంతో కూడి ఉండాలని సంగీత దర్శకుడు థమన్‌ భావిస్తున్నాడట.

పాట పాడేందుకు పవన్‌ ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి. గతంలో పలువురు హీరోలను పాడేందుకు ఒప్పించిన థమన్‌ ఖచ్చితంగా పవన్‌ ను కూడా ఒప్పిస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. పవన్‌ మళ్లీ పాట పాడితే అభిమానులకు పండుగే. వచ్చే ఏడాదిలో ఈ రీమేక్‌ పట్టాలెక్కి వచ్చే ఏడాదిలోనే విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు.