Begin typing your search above and press return to search.

క్రేజీ ప్రాజెక్ట్ ని టెన్ష‌న్ పెడుతున్న త‌మ‌న్‌!

By:  Tupaki Desk   |   10 Sept 2022 5:00 AM IST
క్రేజీ ప్రాజెక్ట్ ని టెన్ష‌న్ పెడుతున్న త‌మ‌న్‌!
X
టాలీవుడ్ లో అత్యంత బిజీగా వున్న సంగీత ద‌ర్శ‌కుల్లో త‌మ‌న్ ముందు వ‌రుస‌లో నిలుస్తున్నాడు. మాస్ మ‌హారాజా ర‌వితే `కిక్‌` సినిమాతో త‌మ‌న్ ప్ర‌స్థానం తెలుగులో మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ప్ర‌తీ ఏడాది అర‌డ‌జ‌నుకు పైగా స్టార్ హీరోల సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తూ తెలుగులో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. అప్పుడ‌ప్పుడు కాపీ మాస్ట‌ర్ అంటూ అడ్డంగా బుక్క‌వుతూ నెట్టింట ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ట్రెండ్ అవుతున్నాడు.

అల్లు అర్జున్‌, త్ర‌విక్ర‌మ్ ల క‌లయిక‌లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `అల వైకుంఠ‌పుర‌ములో` త‌రువాత ఏ స్టార్ హీరోను క‌దిలించినా త‌మన్ పేరే వినిపిస్తోంది. ఈ ఏడాది త‌మ‌న్ దాదాపు ప‌ది క్రేజీ సినిమాల‌కు మించి సంగీతం అందిస్తున్నాడు. విజ‌య్ వార‌సుడుతో పాటు మ‌హేష్ - త్రివిక్ర‌మ్ మూవీ, రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ ల క్రేజీ ప్రాజెక్ట్ త‌మ‌న్ చేతిలోనే వున్నాయి. ఇవి కాకుండా మెగాస్టార్ `గాడ్ ఫాద‌ర్‌`, బాల‌కృష్ణ 107వ మూవీస్ కూడా వున్నాయి.

రీసెంట్ గా విడుద‌లైన `గాడ్ ఫాద‌ర్‌` టీజ‌ర్ కు త‌మ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం ట్రోలింగ్ కు గురైన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఫైన‌ల్ రిరికార్డింగ్ వ‌ర్క్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఈ మూవీ టీజ‌ర్ కు అందించిన నేప‌థ్య సంగీతంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో చిత్ర బృందం ఎంటైర్ బ్యాగ్రౌండ్ స్కోర్ పై ప్ర‌త్యేక దృష్టి పెట్టింద‌ట‌. ఈ మూవీని అక్టోబ‌ర్ 5న ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌బోతున్న విషయం తెలిసిందే.

ఈ మూవీతో పాటు బాల‌కృష్ణ 107 మూవీ కి కూడా నేప‌థ్య సంగీతం బ్యాలెన్స్ గా వుంద‌ట‌. అది పూర్తి చేయాలి. దీన్ని కూడా ద‌స‌రా బ‌రిలో దింపేయాల‌ని టీమ్ భావిస్తోంది. కానీ అది ఎంత వ‌ర‌కు వీల‌వుతుందో తెలియ‌డం లేదు. ఇక విజ‌య్ వార‌సుడు, రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ ల మూవీ, మ‌హేష్ - త్రివిక్ర‌మ్ ల ప్రాజెక్ట్ కు కూడా త‌మ‌నే సంగీతం అందిస్తున్నాడు. అయితే త్వ‌ర‌లో యుఎస్ లో త‌మ‌న్ మ్యూజిక‌ల్ టూర్ కు వెళ్ల‌బోతున్నాడు.

దాని కోసం ఈ ప్రాజెక్ట్ ల‌కు హ‌రీ బ‌రీగా మ్యూజిక్ అందిస్తాడా? అని మేక‌ర్స్ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. త‌మ‌న్ రీసెంట్ ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మ‌ధ్య త‌మ‌న్ నేప‌థ్య సంగీతంపై పెద్ద‌గా దృష్టి పెట్ట‌డం లేద‌ని, ఏదో అయిపోయింది అనిపించేస్తున్నాడ‌ని ఫీల‌వుతున్నార‌ట‌. మ‌రి యుఎస్ టూర్ నేప‌థ్యంలో త‌మ‌న్ మ‌ళ్లీ అవే త‌ప్పులు చేస్తాడా? లేక అందిరి అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేస్తూ బెస్ట్ మ్యూజిక్ ఇస్తాడా అన్న‌ది వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.