Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్'లోను ఐటమ్ సాంగ్ ఉందా అని అడిగారు

By:  Tupaki Desk   |   30 Nov 2021 6:41 AM IST
వకీల్ సాబ్లోను ఐటమ్ సాంగ్ ఉందా అని అడిగారు
X
ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలు తమన్ రికార్డింగ్ థియేటర్లో పాటలను నింపుకుని వస్తున్నాయి. ఆయన నుంచి వస్తున్న పాటలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరికీ కనెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా యూత్ ను ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఐదు నిమిషాల పాటలోనే అద్భుతాలు చేయడానికి ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరోకి గల క్రేజ్ .. అభిమానులు ఆయన సినిమా నుంచి కోరుకునే పాటల పల్స్ తెలుసుకుని ఆయన బాణీలు కడుతున్నాడు. వరుస సక్సెస్ లను వాకిట్లో కట్టేస్తున్నాడు.

"స్టార్ హీరోలు .. స్టార్ డైరెక్టర్లతో పనిచేసేటప్పుడు ఎలాంటి టెన్షన్స్ ఉంటాయి? అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో ఆయనకి ఎదురైంది. అందుకు తమన్ స్పందిస్తూ .. "ఒక్కో హీరో అభిమానులు ఒక్కోరకమైన అంశాలను ఆ సినిమా నుంచి ఆశిస్తూ ఉంటారు. పవన్ అభిమానులు ఆయన నుంచి మాస్ కంటెంట్ ను ఎక్కువగా కోరుకుంటారు. 'వకీల్ సాబ్'లో ఐటమ్ సాంగ్ ఉందా? అని అడిగారు. వాళ్లు అలాగే ఆలోచిస్తారు. అప్పుడు నేను 'మగువా మగువా' అనే పాటనే మాస్ బీట్ లో కొట్టేసి వాళ్లను శాటిస్ ఫై చేశాను. అలాగే రీ రికార్డింగ్ విషయంలో మంచి స్పేస్ తీసుకుని వాళ్లకి నచ్చేలా చూసుకున్నాను.

ఏ సినిమాకైనా మ్యూజిక్ అనేది ఒక వెడ్డింగ్ కార్డు వంటిదే. ఆ వెడ్డింగ్ కార్డు కొత్తగా .. అందంగా బాగున్నప్పుడే జనాలు ఎక్కువగా ఇష్టపడతారు. త్రివిక్రమ్ గారి సినిమాల విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ట్యూన్ ఓకే చేయించుకోవడంలో నాకు టెన్షన్ ఉండదు. దానిని ప్రెజెంట్ చేయడంలోనే నాకు చాలా భయం ఉంటుంది. 'భీమ్లా నాయక్' పాటలన్నీ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే .. కారవాన్ లోనే చేసేశాం. త్రివిక్రమ్ గారు కథపైనే ఉంటారు గనుక పాట ఎలా మొదలవ్వాలనేది కూడా ఆయనే చెప్పేస్తారు.

కథలో నుంచి పాటలోకి ఎలా తీసుకువెళ్లాలనేది చాలా ఇంపార్టెంట్ .. అందులో ఆయన మాస్టర్. ఆయనతో వర్క్ చేయడమనేది చాలా కూల్ గా ఉంటుంది. ఇంత పెద్ద ఆల్బమ్ చేశామా? ఇంత కష్టపడ్డామా? అనేది తెలియదు. పాటలు ఎలా ఉండాలి? ఎలా చేయించుకోవాలి? అనేది ఆయనకి బాగా తెలుసు. అందువల్లనే 'అరవింద సమేత' గానీ, 'అల 'వైకుంఠపురములో'గాని అంత పెద్ద హిట్ అయ్యాయి. త్రివిక్రమ్ గారిని కలిసినప్పుడల్లా ఆయన కొత్తగా కనిపిస్తుంటారు. ఉరికే ఆయన ఏదో ఒకటి మాట్లాడరు .. మాట్లాడింది మాత్రం చాలా కరెక్ట్ గా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.