Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్ హవా.. ఈ రేంజిలోనా??

By:  Tupaki Desk   |   21 Jun 2021 10:30 AM GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్ హవా.. ఈ రేంజిలోనా??
X
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవతరించాడు ఎస్ఎస్ తమన్. రెండేళ్లకు ముందు తమన్ అనే పేరు అప్పుడప్పుడు మాత్రమే వినిపించేది. కానీ ప్రస్తుతం తమన్ పేరు లేకుండా సినిమాల్లో వార్తలు వినిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం తమన్ మ్యూజిక్ పరంగా అంతటి పాపులారిటీ అటెన్షన్ క్రేజ్ సంపాదించుకున్నాడు. వరుసగా మ్యూజికల్ హిట్ ఆల్బమ్స్ తో తమన్ హవా కంటిన్యూ చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో తమన్.. అటు దర్శకులకు ఇటు హీరోలకు మోస్ట్ ఫేవరేట్ అయిపోయాడు. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నా సంగీతంతో నిలబెట్టే సత్తా ఉందని ప్రూవ్ చేసుకున్నాడు తమన్. ప్రస్తుతం తమన్ చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నట్లు సమాచారం.

అందుకే ప్రస్తుతం టాలీవుడ్ మేకర్స్ అందరూ తమన్ మాత్రమే ఫస్ట్ ఛాయస్ అంటున్నారు. A విధంగా తన మ్యూజిక్ తో సినిమాను నిలబెట్టే స్థాయిలో తమన్ పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పాటలతో పాటు నేపథ్య సంగీతం విషయంలో తమన్ ఇప్పుడు అందరికి బెస్ట్ ఆప్షన్ అయిపోయాడు. అరవిందసమేత.. మజిలీ.. అలవైకుంఠపురంలో.. క్రాక్.. వకీల్ సాబ్ ఇలా తన ప్రతి సినిమాను సంగీతం పరంగా హైలైట్ చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. తమన్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

తమన్ సంగీతం అనేసరికి సర్కారు పాటపై అందరికి ఆసక్తి పెరిగింది. అలాగే మహేష్ బాబు తదుపరి సినిమాకు కూడా తమనే సంగీతం అందించనున్నాడు. అదేవిధంగా బాలయ్య అఖండ.. థాంక్యూ.. టక్ జగదీష్.. ఏజెంట్.. సినిమాలకు సంగీతం అందిస్తానే మరోవైపు కొత్త సినిమాలను లైనప్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తమన్ నుండి రాబోయే అప్ కమింగ్ సినిమాల్లో మెగాస్టార్ లూసిఫర్ రీమేక్.. డైరెక్టర్ బాబీ న్యూ మూవీ.. రాంచరణ్ - శంకర్ కాంబినేషన్ మూవీలతో పాటు అల్లు అర్జున్ - వేణుశ్రీరామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఐకాన్ సినిమాకు కూడా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంటే మొత్తానికి అందరిని పక్కకు నెట్టేసి తమన్ ఫామ్ లో ఉన్నాడని టాక్ నడుస్తుంది.