Begin typing your search above and press return to search.

#SVP : పాపం అని వదిలేశారట

By:  Tupaki Desk   |   2 May 2022 2:30 AM GMT
#SVP : పాపం అని వదిలేశారట
X
సర్కారు వారి పాట సందడి మొదలయ్యింది. వరుసగా పాటలను విడుదల చేసి ఇప్పటికే జనాల్లో సర్కారు వారి పాట పై అంచనాలు పెంచడంలో థమన్ సఫలం అయ్యాడు. తాజాగా ఆయన సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చాడు. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. మీడియాతో మాట్లాడిన సమయంలో సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన పలు విషయాలను వెళ్లడించాడు.

సినిమా పై ఉన్న అంచనాలు అందుకోవడం పెద్ద ఛాలెంజ్ గా మారిందని... అయితే తప్పకుండా అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను థమన్ వ్యక్తం చేశాడు. ఇక ఈ సినిమా లోని కళావతి పాటను విడుదల తేదీ ప్రకటించి ఒక రోజు ముందు గానే లీక్ అయిన కారణంగా విడుదల చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో థమన్ చాలా ఎమోషనల్‌ అయ్యాడు.

లీక్ చేసిన వ్యక్తి పై ఆ సమయం లోనే థమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నమ్మి పని ఇస్తే ఇలా చేశాడంటూ థమన్‌ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఆయన వేదనను తెలియజేశాయి. ఆ సమయంలో థమన్ ఉన్న కోపం మరియు చిత్ర నిర్మాతలు ఉన్న కోపంతో ఖచ్చితంగా లీక్ కు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించి ఉంటారు.. పోలీసుల వరకు కూడా తీసుకు వెళ్లి ఉంటారని భావించారు.

తాజాగా ఆ విషయమై స్పందిస్తూ.. లీక్ కు పాల్పడిన వాడిని వెంటనే గుర్తించాము. కాని వాడి కెరీర్‌ ను దృష్టిలో ఉంచుకుని పేరు కూడా బయట పెట్టకుండా వదిలి పెట్టాము. మళ్లీ ఎప్పుడు ఇలాంటి పనులు చేయవద్దంటూ హెచ్చరించి వదిలేశామంటూ థమన్ చెప్పుకొచ్చాడు. పాపం అంటూ అంత పెద్ద తప్పు చేసినా కూడా వదిలేయడం అనేది గొప్ప విషయం.

ఈమద్య కాలంలో లీక్ లు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో లీక్ లకు పాల్పడ్డ వారిని క్షమించవద్దంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకరు ఇద్దరిని కఠినంగా శిక్షించి.. వారికి పడ్డ శిక్ష ను బహిరంగంగా వ్యక్తం చేస్తే అప్పుడు ఇతరులు లీక్ చేయాలంటే భయపడుతారు.. ఒక వేళ లీక్ అయిన కంటెంట్‌ ను షేర్‌ చేయాలన్నా కూడా భయపడుతారు అనేది కొందరి ఉద్దేశ్యం. అయితే తెలియక చేసిన లీక్ విషయంలో పాపం అంటూ వదిలేయడం మంచి నిర్ణయమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.