Begin typing your search above and press return to search.

థమన్.. బీట్ కావాలమ్మా

By:  Tupaki Desk   |   2 Nov 2017 12:14 PM IST
థమన్.. బీట్ కావాలమ్మా
X
టాలీవుడ్ లో ఇప్పుడు సంగీత దర్శకులు అంతగా రాణించడం లేదా అనే డౌట్స్ అందరికి వస్తున్నాయి. గతంలో స్టార్ సినిమాల్లోని పాటలు కనీసం ఏడాది వరకైనా హల్ చల్ చేసేవి. కానీ ప్రస్తుతం నెల రోజులు కూడా నిలవడం లేదు. రెండు మూడు సార్లు వినగానే పాటలు బోర్ కొట్టేస్తున్నాయి. ఎవరో ఒకరు మంచి ట్యూన్స్ ఇచ్చినా అవి కూడా అప్పటి వరకే బాగుంటున్నాయి.

అయితే గతంలో బాగానే వాయించిన మ్యూజిక్ డైరక్టర్ థమన్ మ్యూజిక్ కూడా ఈ మద్యన అంతగా బాగుండడం లేదనే టాక్ బాగా వినిపిస్తోంది. థమన్ గత రెండేళ్లుగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులను దక్కించుకోవడం లేదు. రీసెంట్ గా నాగార్జున - రాజు గారి గది 2 అలాగే మహానుభావుడు సినిమాలతో వచ్చిన థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఒకే అనిపించాడు గాని అసలైన పాటల విషయంలో అంతగా మెప్పించలేదు.

ప్రస్తుతం థమన్ చేతిలో సినిమాలు చాలానే ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ తో విన్నర్ - ఇంటిలిజెంట్ తో పాటు నితిన్ తీయబోయే ఒక కొత్త సినిమాకు కూడా సైన్ చేశాడు. వాటితో పాటు రీసెంట్ గా మారో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లను అందుకున్నాడు థమన్. నాగ చైతన్య - మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాతో పాటు బోయపాటి శ్రీను - రామ్ చరణ్ ప్రాజెక్ట్ కి కూడా మ్యూజిక్ అందించే ఛాన్సును కొట్టేశాడు. మరి ఈ సినిమాలకైనా థమన్ గుర్తుండిపోయే బాణీలను అందిస్తాడో లేదో చూడాలి.