Begin typing your search above and press return to search.

సన్ రైజర్స్ కోసం రంగంలోకి థ‌మ‌న్-దేవి జోడీ!

By:  Tupaki Desk   |   10 March 2023 2:30 PM IST
సన్ రైజర్స్ కోసం రంగంలోకి థ‌మ‌న్-దేవి జోడీ!
X
టాలీవుడ్ మోస్ట్ వాంటెంట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు థ‌మ‌న్-డీఎస్పీలు జోడీ క‌డుతున్నారా? ఇద్ద‌రు జంట‌గా సాంగ్ కంపోజ్ చేయ‌బోతున్నారా? ఆ ఇద్ద‌ర్నీ 2023 ఐపీఎల్ క‌లుపుతోందా? అంటే అవున‌నే స‌మాచారం అందుంతోంది. టాలీవుడ్ లో ఇద్ద‌రికీ ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అవ‌కాశాలు అందుకోవ‌డంలో ఒక‌రికొకరు పోటీ ప‌డుతుంటారు. స్టార్ హీరోల చిత్రాల‌కు సంగీతం అందించాలంటే? ఆ ఇద్ద‌రి లో ఎవ‌రో ఒక్క‌రు త‌ప్ప‌నిస‌రి.

హీరోలు ఏరికోరి మ‌రీ ఆ ఇద్ద‌ర్ని ఎంపిక చేసుకుంటారు. అయితే ఇద్ద‌రు ఒకే వేదిక‌పై ఏనాడు క‌నిపించింది లేదు. ఆ మధ్య `ఎవరు మీలో కోటీశ్వరుడు` ప్రోగ్రాంకి జూనియర్ ఎన్టీఆర్ కోసం కలిసి వ‌చ్చారు. అంత‌కుముందుగానీ..ఆ త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి స‌న్నివేశం చోటు చేసుకోలేదు. అయితే ఇప్పుడీ జోడీ త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం క‌లిసి పనిచేస్తుంది.

హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ టీమ్ కోసం ఇద్ద‌రు అదిరిపోయే  ఓస్పెష‌ల్ బ్యాక్ గ్రౌండ్  సాంగ్ కంపోజ్ చేస్తున్నారుట‌. మ‌రి ఇందులో ఎవ‌రెలా భాగ‌స్వామి అవుతున్నారు? అన్న‌ది  తెలియాలి. ఒక‌రు గాయ‌కుడిగా..మ‌రొక‌రు ట్యూన్ కంపోజర్ గాచేస్తారా?  లేక రెండు ప‌నులు ఇద్ద‌రు క‌లిసే చేస్తారా? అన్న‌ది చూడాలి. డీఎస్పీ వేగం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అన్ని తానై ఉండాల‌నుకుంటాడు.

పాట‌లు పాడేస్తారు. డాన్సులు చేసేస్తారు. ఆ ర‌కంగా డీఎస్పీ ఎన‌ర్జీని మ్యాచ్ చేయ‌డం అంత ఈజీ కాదు. ఇక థ‌మ‌న్ త‌క్కువోడేం కాదు. ఆయ‌న మంచి గాయ‌కుడు.  దేవి లాస్పెప్పులు వేయ‌రు గానీ...ఆ ఎన‌ర్జీని మాత్రం చూపించ‌గ‌ల‌రు. అందులోనూ క్రికెట్ అంటే థ‌మ‌న్ కి పిచ్చి. మ్యాచ్ ల సంద‌ర్భంలో ఎంతో ఎగ్జైట్ అవుతుంటారు.  

ఇటీవ‌ల జ‌రిగిన సెల‌బ్రిటీ లీగ్ లో కూడా పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఇంటర్నేషన ల్ టోర్నీలు జరిగినప్పుడు ఇండియా తరఫున  ఆస‌క్తిక‌ర ట్వీట్లు పెడుతుంటారు. డీఎస్పీ కూడా క్రికెట్ ని బాగానే ఆస్వాదిస్తారు. అయితే థ‌మ‌న్ అంత ఆస‌క్తిని చూపించ‌రు. మ‌రి ఈ ద్వ‌యం స‌న్ రైజ‌ర్స్ ఎలాంటి సాంగ్ కంపోజ్ చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.