Begin typing your search above and press return to search.

స‌ర్కార్ వారి కోసం థ‌మ‌న్ డ్ర‌మ్మింగ్ పీక్స్

By:  Tupaki Desk   |   28 Oct 2021 10:30 AM GMT
స‌ర్కార్ వారి కోసం థ‌మ‌న్ డ్ర‌మ్మింగ్ పీక్స్
X
టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల‌న్నీ థ‌మ‌న్ ఖాతాలోకే వెళుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికిప్పుడు చిరంజీవి- ప‌వ‌న్ క‌ల్యాణ్‌ - మ‌హేష్ - బాల‌కృష్ణ‌- ఎన్టీఆర్ స‌హా టాప్ స్టార్ల సినిమాల‌కు అత‌డు సంగీతం అందిస్తున్నాడు. మ‌హేష్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు పని చేస్తున్నాడు. మ‌హ‌ర్షి త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు స‌ర్కార్ వారి పాట చిత్రానికి థ‌మ‌న్ బాణీల్ని స‌మ‌కూరుస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌లే సర్కారు వారి పాట కోసం థమన్ బాణీల‌న్నీ రెడీ చేసేసార‌ని క‌థ‌నాలొచ్చాయి. ప్ర‌స్తుతం రీరికార్డింగ్ పై అత‌డు దృష్టి సారించార‌ని అర్థ‌మ‌వుతోంది. తాజాగా రికార్డింగ్ స్టూడియోలో థ‌మ‌న్ జోష్ చూస్తుంటే అత‌డు స్వింగ్ లో ఉన్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. స‌ర్కార్ వారి కోసం డ్ర‌మ్మింగ్ హ‌మ్మింగ్ కుమ్మింగ్! అంటూ అద్భుత‌మైన పోయెట్రీని చెబుతున్నాడు. అత‌డి వెన‌క రికార్డింగ్ స్టూడియో సెట‌ప్ మొత్తం క‌నిపిస్తోంది. భారీత‌నం నిండిన‌ కీబోర్డ్ .. స్టూడియో సౌండ్ సిస్ట‌మ్ స‌హా పీసీలో అత‌డు గ్రాఫ్ మానిట‌రింగ్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పెండింగ్ చిత్రీక‌ర‌ణల్ని వేగంగా పూర్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మహేష్- కీర్తి సురేష్ లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై పాటలు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీంతో సర్కార్ వారి పాట షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. దీపావళి నుండి టీమ్ SVP ప్రమోషన్లను ప్రారంభిస్తుంది. మ‌హేష్ పై చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో మ‌దీ సినిమాటోగ్ర‌ఫీ గురించి థ‌మ‌న్ ప్ర‌స్థావిస్తూ ఓ ఫోటోని షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ కూడా వైర‌ల్ గా మారింది.

సర్కారు వారి పాట 13 జనవరి 2022న గ్రాండ్ రిలీజ్ కానుంది. US ప్రీమియర్ లకు జనవరి 12న ప్లానింగ్ సాగుతోంది. తెలుగు రాష్ట్రాలు స‌హా ఓవ‌ర్సీస్ లోనూ ఈ చిత్రం భారీ బిజినెస్ చేస్తోంద‌ని స‌మాచారం.