Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బిగ్ బాస్.. తమన్ డోస్

By:  Tupaki Desk   |   17 Jun 2017 4:28 AM GMT
ఎన్టీఆర్ బిగ్ బాస్.. తమన్ డోస్
X
బిగ్ బాస్ రియాలిటీ టి‌వి షో ని తెలుగులో రూపొందించాలి అనుకున్నప్పటి నుండి ఎవరు చేస్తారు అనే సందేహం అందరిని వెంటాడింది. చాలా చర్చలు తర్వాత యంగ్ ఎన్టీఆర్ అయితే బిగ్ బాస్ షో ని అనుకున్న విధంగా జనాలలోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడతాడు అని భావించి ఫైనల్ చేసుకున్నారు. నిజంగానే వాళ్ళ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ 100 మార్కులు కొట్టేశాడు షో ని మార్కెట్ చేయడంలో. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ పని చేసిపెట్టేసింది.

బిగ్ బాస్ షో తెలుగులో స్టార్ మా లో ప్రసారం అవుతుంది. ఈ షో కోసం ఎన్టీఆర్ భారీ మొత్తంలో చార్జ్ చేశాడు అని ఒక వార్త కూడా వచ్చింది. ఈ షో యొక్క థీమ్ సాంగ్ ను తెలుగు తమిళ్ సినిమాలలో తన మార్క్ మ్యూజిక్ తో స్టార్ హీరోలుకు మ్యూజికల్ హిట్ ఇచ్చిన తమన్ సమకూరుస్తున్నాడు. తమన్ ఈ బిగ్ బాస్ టైటిల్ సాంగ్ అందరిని అలరిస్తుంది అని చాలా నమ్మకంగా చెబుతున్నాడు. “నా ప్రియమైన సోదరుడు కోసం ఇప్పుడే మంచి ట్యూన్ చేశా. ఇది మీకు కూడా బాగా నచ్చి మంచి కిక్ ఇస్తుంది అని అనుకుంటున్నా” అని చెప్పాడు తమన్.

తమన్ దీని కన్నా ముందు ఎన్టీఆర్ సినిమాలు ‘బృందావనం’ - ‘బాద్షా’ - ‘రామయ్యా వస్తావయ్యా’ వంటి వాటికి సంగీతం ఇచ్చాడు. అవి కూడా మంచి విజయం సాధించాయి. ఈ లెక్కన బిగ్ బాస్ షో మంచి శుభారంభం చేసినట్లే తెలుగులో...

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/