Begin typing your search above and press return to search.
అది కొట్టడంలో తమనే కింగు
By: Tupaki Desk | 27 Jun 2015 11:00 PM ISTటాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ స్పీడ్ గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ నాలుగైదు సినిమాలు మినిమమ్ రన్నింగ్‌లోనే ఉంటాయి. స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తమన్‌ని పిలిచి మరీ అవకాశాలిస్తారు. అయితే ఇలా ఛాన్సులు రావడం వెనుక దేని లెక్క దానికి ఉంది. తమన్ సంగీతం అందించిన పాటలపై బోలెడన్ని విమర్శలు ఉన్నా.. అతడు ఇచ్చే రీరికార్డింగ్‌ని మాత్రం వేలెత్తి చూపించలేదెవరూ.
అసలు సినిమాకి రీరికార్డింగ్ బ్యాక్‌బోన్ లాంటిది. ఒక మామూలు సన్నివేశాన్ని కూడా తనదైన ఆర్‌ఆర్‌తో అద్భుతంగా మార్చేసే సత్తా తమన్‌కి ఉంది. ఆర్‌ఆర్ విషయంలో ఏ లోపం లేకుండా ఇస్తాడన్న టాక్ ఉంది. పైగా తమన్ అయితే ఇన్‌టైమ్‌లో పని పూర్తి చేస్తాడు. అందుకే ఫిలింమేకర్స్ అంతా అతడి వెంటపడుతుంటారు. నిన్న రిలీజైన టైగర్ సినిమాకి తమన్ అందించిన ఆర్.ఆర్ వెన్నెముకలా నిలిచింది.
మునుముందు రవితేజ హీరోగా నటించిన కిక్2 రిలీజ్ కానుంది. దీనికి తమన్ సంగీతం అందించాడు. డాల్బీ అట్మోస్ సిస్టమ్‌లో ఆర్‌ఆర్‌ని అదరగొట్టేశాడని చెబుతున్నారు. అలాగే రామ్‌చరణ్- శ్రీనువైట్ల సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి ఇంట్రడక్షన్ సాంగ్ కోసం తమన్ ఇటీవలే ట్యూన్ వినిపించాడుట. అది అదిరిపోయే రేంజులో ఉందని చెబుతున్నారు. ఈ టైటిల్ సాంగ్‌ని ఆరడుగులు బుల్లెట్టు రచయిత శ్రీమణి రాశాడు. అదీ సంగతి.