Begin typing your search above and press return to search.
మహేష్ తో తమన్ ఏ సినిమా అబ్బా?
By: Tupaki Desk | 28 Nov 2016 9:11 AM ISTసౌత్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ పై కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయ్ కానీ.. మహేష్ బాబుతో ఈ కంపోజర్ కాంబినేషన్ సూపర్బ్ గా క్లిక్ అయింది. దూకుడు.. బిజినెస్ మ్యాన్.. ఆగడు వంటి సినిమాలకు అదిరిపోయే సంగీతం అందించాడు థమన్. ఈ మధ్య కొంచెం స్లో అయిన ఈ మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పుడు సూపర్ స్టార్ తో కొత్త సినిమా చేస్తున్నట్లు చెప్పడం.. ఓ పజిల్ లా మరింది.
'త్వరలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నా' అంటూ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ చేసేశాడు థమన్. కానీ ఏ మూవీకి అనే విషయం మాత్రం రివీల్ చేయని థమన్.. ఆన్సర్ ని ఊహించుకోమన్నట్లుగా వదిలేశాడు. మురుగదాస్ మూవీ తర్వాత మహేష్ బాబు కొరటాల శివతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ ను ఫైనల్ చేసేశారు కూడా. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేస్తాడు మహేష్. మహేష్ బాబు-వంశీ చిత్రానికి గోపీ సుందర్ కి ఛాన్స్ ఇచ్చారనే టాక్ ఇప్పటికే ఉంది. మరి థమన్ ఎవరి సినిమాకి వర్క్ చేయనున్నాడో అని ఆరా తీసేస్తున్నారు అభిమానులు.
పూరీ జగన్నాథ్ తో మహేష్ బాబు 'జన గణ మన' చేస్తాడని.. దానికే థమన్ ను ఫైనల్ చేసుంటారని గెస్సింగ్ మొదలైపోయింది. అయితే ఆ ప్రాజెక్టు గురించి ఇంతవరకు మహేష్ తనకు ఫోన్ చేయలేదని.. డేట్లు ఇవ్వలేని పూరి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. మరి థమన్ ఏ డైరక్టర్ సినిమాకు మహేష్ కోసం మ్యూజిక్ కొడుతున్నాడు? సారొస్తారొస్తారు... అంటూ ఏ సినిమా కోసం వచ్చావ్ థమన్? చెప్పమ్మా...
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/