Begin typing your search above and press return to search.

150వ సినిమాకి ఛాన్సిస్తాడా?

By:  Tupaki Desk   |   20 July 2015 3:55 PM IST
150వ సినిమాకి ఛాన్సిస్తాడా?
X
మెగాస్టార్‌ చిరంజీవి నటించే 150వ సినిమా ఆల్‌ టైమ్‌ హాట్‌ టాపిక్‌. ఇక ఎంతో దూరం లేదు. ఆ శుభఘడియ రానే వచ్చేస్తోంది. ఆగస్టు లో అన్నయ్య పుట్టిన రోజున మెగా లాంచింగ్‌ కి అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సినిమా కాస్టింగ్‌, టెక్నీషియన్స్‌ డేటా ను ఇంకా రివీల్‌ చేయలేదు. అయితే ఈసారి చిరు 150వ సినిమా టెక్నీషియన్ల జాబితా లో తమన్‌ పేరును పరిశీలించే ఛాన్సుంది. ఇదిగో ఆ సంగతిని ఇక్కడ కనిపిస్తున్న ఈ పిక్‌ చెప్పేస్తోంది.

నిన్నటి రోజున టీఎస్సార్‌-టీవీ 9 అవార్డుల వేడుకల్లో ఓ అరుదైన అవకాశం దొరికింది తమన్‌ కి. తన ఫేవరెట్‌ హీరో మెగాస్టార్‌ చిరంజీవి తో ఓ ఫోటో దిగే అవకాశం దక్కింది. ఆ క్షణం తమన్‌ ఆనందానికి అవధుల్లేవ్‌. పద్మభూషణుడు చిరంజీవి తో మొదటి ఫోటో అంటూ.. ఓ చిన్నపిల్లాడిలా తెగ సంబరపడిపోయాడు. ఈ సందర్భంగా ఆ దృశ్యం వీక్షించేవాళ్లకు ఓ సందేహం కూడా వచ్చింది. మెగాస్టార్‌ 150వ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమనే నా అన్న డౌటొచ్చింది. ఎలాగూ మూహూర్త కార్యక్రమం దగ్గర్లో నే ఉంది కాబట్టి ఆరోజు అన్ని సందేహాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేయొచ్చు. తెలుగు మూలాలున్న బిడ్డడు కాబట్టి.. ఘంటసాల బలరామయ్య తాలూకూ కాబట్టి, అక్కినేని మెచ్చిన సంగీతదర్శకుడు కాబట్టి .. తమన్‌ కి ఈ అరుదైన అవకాశం దక్కాలనే ఆశిద్దాం.