Begin typing your search above and press return to search.

దళపతి విజయ్.. అజిత్​ను బీట్​ చేశాడుగా!

By:  Tupaki Desk   |   31 Jan 2023 11:00 AM GMT
దళపతి విజయ్.. అజిత్​ను బీట్​ చేశాడుగా!
X
సంక్రాంతి పండక్కి ఏ సినిమా రిలీజ్ అయినా సరే మంచి టాక్ సొంతం చేసుకుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటాయి. అందులో స్టార్ హీరోలు ఉండటం వల్ల కేవలం ఓపెనింగ్ మాత్రమ్ గ్యారంటీ.‌ అలానే ఈ సంక్రాంతికి మన తెలుగులో చిరంజీవి వాల్తేరు వీరయ్య గా, బాలకృష్ణ వీరసింహరెడ్డి గా పోటీలో దిగారు. అయితే తమిళంలో అజిత్, విజయ్ బరిలోకి దిగారు. అజిత్ తునివు తెలుగులో తెగింపు గా రిలీజ్ అయ్యింది. ఇక విజయ్ వారిసు తెలుగులో వారసుడుగా వచ్చాడు.

తెలుగులో ఈ రెండు సినిమాలు వేరే వేరే తేదీల్లో రిలీజ్ అయ్యాయి. తమిళంలో మాత్రం వారిసు, తునివు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే... ఈ సంక్రాంతి బరిలో విజయ్ వర్సెస్ అజిత్ వార్ లో ఎవరు గెలిచారు. ఎవరి సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి? ఎవరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అనేది చూస్తే... అజిత్ పై విజయ్ ది పైచేయిగా నిలిచింది అని చెప్పవచ్చు.

తమిళ్ లో పండక్కి అజిత్ తెగింపు గా వస్తె... మొదటి రోజు బాగానే కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు తగ్గిపోయాయి. ఫ్యామిలీ కంటెంట్ తో వచ్చిన వారసుడు కు జనాలు మొగ్గు చూపారు. ఓవరాల్‌గా అజిత్ మూవీ కంటే తెలుగు, హిందీ వెర్షన్‌ల నుంచి, వరిసు మాత్రమే 30 కోట్లు, తమిళ వెర్షన్ నుంచి 70 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది.

ఓవరాల్‌గా, పోటీలో అజిత్​ కన్నా విజయే 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించాడు. తునివు, వరిసు రెండూ బాక్సాఫీస్ వద్ద మొదట్లో అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. తమిళనాడులో వారసుడు సినిమా 4, 5 సినిమాల మిక్సింగ్ అంటూ ట్రోల్స్ వచ్చినా...మెల్లిగా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం నిలదొక్కుకుని... అజిత్ మూవీపై పైచేయి సాధించింది. వారసుడు మూవీని దిల్ రాజు నిర్మించగా... వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.