Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ ప్రయత్నాన్ని అడ్డుకున్న స్టార్ హీరో
By: Tupaki Desk | 12 Jun 2020 12:09 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు ఈనెల 22న జరగబోతోంది. రజినీకాంత్ తరువాత అత్యంత భారీ ఫాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ పుట్టినరోజు నాడు అభిమానులు కొన్ని స్పెషల్ ప్లాన్స్ వేసుకున్నారు. లక్షలాది మంది అభిమానులు ఈ హీరోకు మంచి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారట..
విజయ్ బర్త్ డే సందర్భంగా ప్రతీ ఏరియాలోనూ ఆయన బర్త్ డేను గ్రాండ్ గా చేయాలని అభిమానులు డిసైడ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వార్త తెలిసి విజయ్ దెబ్బకు భయపడిపోయాడట.. కరోనా సమయంలో ఇలా చేస్తే వైరస్ వ్యాప్తి చెందుతుందని.. అది తనకే చెడ్డపేరు వస్తుందని తెలిసి అభిమానులను కంట్రోల్ చేయాలని డిసైడ్ అయ్యారు.
తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశంలోనే రెండో స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది.జనాలు రూల్స్ ఏమాత్రం పాటించడం లేదు.
దీంతో లక్షలాది మంది అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారని విన్న విజయ్ వెంటనే తన అభిమానులకు హెచ్చరికలు జారీ చేశారు. అభిమానులంతా తన బర్త్ డే వేడుకలు నిర్వహించవద్దని పిలుపునిచ్చాడు. అలాగే ఫ్లెక్సీలు కట్టవద్దని.. ఆ డబ్బుతో పేద ప్రజలకు సహాయం చేస్తే అది తనకు మంచి గిఫ్ట్ అని అభిమానులను కోరాడు.