Begin typing your search above and press return to search.

దళపతి పేరిటే 'ట్విట్టర్ స్పేస్' న్యూ రికార్డు!

By:  Tupaki Desk   |   23 Jun 2021 6:00 AM IST
దళపతి పేరిటే ట్విట్టర్ స్పేస్ న్యూ రికార్డు!
X
సోషల్ మీడియాలో సౌత్ స్టార్ హీరో దళపతి విజయ్ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ ఊపందుకున్నాయి. దాదాపు కొన్నిరోజుల ముందే విజయ్ బర్త్ డే వేడుకలు మొదలైపోయాయి. ఈరోజు దళపతి 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్విట్టర్ స్పేస్ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్ స్పేస్ అనేది సెలబ్రిటీలు నేరుగా అభిమానులతో సంభాషించడం.. లేదా సెలబ్రిటీస్ అన్ టోల్డ్ స్టోరీస్ వినిపించడంతో ప్రజాదరణ దక్కించుకుంటుంది

తాజాగా దళపతి బర్త్ డే సందర్బంగా ఫ్యాన్స్ సంబరాలు రెట్టింపు చేయడానికి విజయ్ తో కలిసి వర్క్ చేసిన ప్రముఖులు ట్విట్టర్ స్పేస్ ప్రోగ్రాం తమిళ టీవీ యాంకర్ దిది హోస్ట్ చేసింది. అయితే మాములుగా సినిమా ఫస్ట్ లుక్ రికార్డులతో పాటు ట్విట్టర్ స్పేస్ రికార్డు కూడా క్రియేట్ చేశారు దళపతి ఫ్యాన్స్. అయితే ప్రస్తుతం ఈ స్పేస్ ఇండియాలోనే "అత్యధికంగా ప్రేక్షకులు పాల్గొన్న స్పేస్"గా రికార్డులోకెక్కింది. దాదాపు ఈ స్పేస్ లో 27,971 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సెకండ్ బిగ్ స్పేస్ కావడం విశేషం. ఇప్పటివరకు ఈ ట్విట్టర్ స్పేస్ లో మొదటి స్థానం చైనీస్ మ్యూజిషియన్ బామ్ బామ్ పేరిట ఉంది.

బామ్ బామ్ స్పేస్ లో 44,208 మంది పాల్గొన్నారని సమాచారం. ఇప్పుడు సెకండ్ స్థానంలో విజయ్ నిలవడం పుట్టినరోజు స్పెషల్ ప్యాకేజీగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే మొన్నటివరకు సెకండ్ పోసిషన్ లో ఉన్నటువంటి నిక్ కార్టార్ (26218) రికార్డును విజయ్ వెనక్కి నెట్టేసాడు. ప్రస్తుతం విజయ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అలాగే తాజాగా విజయ్ తదుపరి సినిమా టైటిల్ పోస్టర్స్ వచ్చేసరికి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం విజయ్ 65వ సినిమాకు 'బీస్ట్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఆల్రెడీ ఈ సినిమా నుండి రెండు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసేసారు. ప్రస్తుతం అవి ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. హీరోయిన్ గా పూజాహెగ్డే నటించనుంది.