Begin typing your search above and press return to search.
నాలుగోసారి దీపావళినే లాక్ చేసిన దళపతి
By: Tupaki Desk | 19 May 2020 10:15 AM ISTతమిళ హీరోలకు దీపావళి సెంటిమెంట్ ఏ రేంజులో వర్కవుటవుతుందో తెలిసిందే. అయితే ఇతర హీరోల కంటే ఇలయదళపతి విజయ్ కి దీపావళి సెంటిమెంటు మరీ ఎక్కువ. ఇప్పటికే అతడు నటించిన మూడు సినిమాలు దీపావళి రేసులో రిలీజై విజయం సాధించాయి. ఇప్పుడు నాలుగోసారి దీపావళి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాడు. విజయ్ నటించిన మాస్టర్ 2020 దీపావళి బరిలో రిలీజ్ కానుందన్నది తాజా సమాచారం.
వాస్తవానికి ఏప్రిల్ 9న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. కొవిడ్ 19 మహమ్మారీ తమిళనాడును అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాల రిలీజ్ లన్నీ వాయిదా పడ్డాయి. పోస్ట్ ప్రొడక్షన్ ఈపాటికే పూర్తి చేసి మాస్టర్ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నా కుదరలేదు. దీంతో సన్నివేశాన్ని విశ్లేషించిన చిత్రబృందం దీపావళికి వాయిదా వేశారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. కఠినమైన భద్రతా నిబంధనల్ని పాఠిస్తూ పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తున్నారు. అయితే ప్రస్తుత సన్నివేశంలో టీజర్లు.. ట్రైలర్ ఆవిష్కరణలు ఉండవని తెలుస్తోంది. నేరుగా ఆన్ లైన్ లోనే సామాజిక మాధ్యమాల్లో ప్రచార చిత్రాల్ని రిలీజ్ చేసేస్తారు. ఈ చిత్రంలో దళపతి విజయ్ సరసన మాళవిక మోహనన్.. ఆండ్రియా జెరోమియా తదితరులు నటించారు. విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషించాడు.