Begin typing your search above and press return to search.
దళపతి ఫ్యాన్స్ నమ్మేలా ఉందా ఇది?
By: Tupaki Desk | 23 Jun 2021 5:00 PM ISTకోలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ నాయికగా వెలిగిపోతోంది మాళవిక మోహనన్. ప్రముఖ ఛాయాగ్రాహకుడు మోహనన్ కుమార్తెగా రంగ ప్రవేశం చేసినా తనదైన మార్క్ నటన అందచందాలతో అలరిస్తోంది ఈ బ్యూటీ. పేట- మాస్టర్ వంటి భారీ చిత్రాలతో ఇటు తెలుగు ప్రేక్షకుల్లోనూ చక్కని గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం ధనుష్ సరసన ఓ క్రేజీ చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. తదుపరి భారీ చిత్రాలకు కమిటవుతోందని సమాచారం. ఇక విజయ్ తో కలిసి టైగర్ ష్రాఫ్ `భాఘి 3` చిత్రం చూసానని చెప్పిన మాళవిక .. థియేటర్ లో ఊహించని ఇన్సిడెంట్ చూసిందట. ``టైగర్ తెరపైకి ఎంట్రీ ఇచ్చినపుడు `తలైవా` అని జనం అరవగానే విజయ్ ఉలిక్కిపడ్డారట. టైగర్ పట్ల విజయ్ అభిమానానికి అది రుజువు..`` అంటూ కాస్త అతిశయోక్తిగానే చెప్పింది.
టైగర్ ష్రాఫ్ కి దళపతి విజయ్ అభిమాని అయినంత మాత్రాన మరీ అలా ఉలిక్కిపడతాడా? విజయ్ రేంజు ఏంటి.. టైగర్ స్థాయి ఎంత? అంటూ అభిమానులు సందేహిస్తున్నారు. మాళవిక చెబుతున్నది వినేందుకు విడ్డూరంగా ఉంది..అంటూ కామెంట్ చేస్తున్నారు.
22 జూన్ విజయ్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ స్పేస్ లో చిట్ చాట్ నిర్వహించగా అభిమానులతో ముచ్చటించిన మాళవిక కాస్త ఓవర్ గానే స్పందించింది. విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న బీస్ట్ చిత్రంలో నటిస్తున్నారు.