Begin typing your search above and press return to search.

బ‌న్ని - ద‌ళ‌ప‌తిని మించిన ఎన‌ర్జిటిక్ డ్యాన్స‌ర్

By:  Tupaki Desk   |   25 Aug 2022 4:08 PM GMT
బ‌న్ని - ద‌ళ‌ప‌తిని మించిన ఎన‌ర్జిటిక్ డ్యాన్స‌ర్
X
టాలీవుడ్ లో ఎన‌ర్జిటిక్ డ్యాన్స‌ర్ గా బ‌న్నీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్టైలిష్ స్టార్ డ్యాన్సుల‌కు వీరాభిమానులున్నారు. ఎన్టీఆర్ - తార‌క్ - చ‌ర‌ణ్ లాంటి స్టార్లు ప్ర‌త్యేకించి బెంచ్ మార్క్ డ్యాన్సర్లుగా ఇండ‌స్ట్రీని ఏల్తున్నారు. అటు కోలీవుడ్ కి వెళితే అక్క‌డ ద‌ళ‌ప‌తి విజ‌య్ డ్యాన్సుల‌కు అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. బ‌న్నీ- తార‌క్ లానే ఎన‌ర్జిటిక్ డ్యాన్సులతో విజ‌య్ అద‌ర‌గొడ‌తాడు.

అయితే స్టారాధిస్టార్ల‌లో ఏ ఒక్క‌రికీ త‌గ్గ‌ని డ్యాన్సుల‌తో ఈ చ‌లాకీ కుర్రాడు అద‌ర‌గొడుతున్నాడు. అత‌డి ఎన‌ర్జిటిక్ డ్యాన్సుల‌కు ఫిదా అవ్వ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ద‌ళ‌ప‌తి విజ‌య్ చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ `అరబిక్ కుతు`కి అత‌డు స్టెప్పుల‌తో దుమారం రేపాడంటే అతిశ‌యోక్తి కాదు. నిజానికి ఒరిజిన‌ల్ లో ద‌ళ‌ప‌తి విజ‌య్ కూడా ఇంత ఎన‌ర్జిటిక్ గా డ్యాన్సులు చేశాడ‌ని అనుకోలేం. అంత ఎన‌ర్జిటిక్ డ్యాన్సుల‌తో ఆద్యంతం క‌ట్టి ప‌డేసాడు. ఇక లిమిటేష‌న్స్ న‌డుమ అత‌డు కొంద‌రు డ్యాన్స‌ర్ల స‌హ‌కారంతో ఈ పాట‌ను రీక్రియేట్ చేసిన తీరు ఎంతో ఆక‌ట్టుకుంది. కొరియోగ్ర‌ఫీ మాస్ట‌ర్ క్లాస్ లో అల‌రించింది.

ప్ర‌స్తుతం ఈ ఫ్యాన్ మేడ్ వీడియో అంత‌ర్జాలంలో సునామీలా మారింది. ఆ యువ‌కుడు ఎవ‌రు? అంటూ అంతా ఆరాలు తీస్తున్నారు. విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `బీస్ట్` చిత్రంలోని ఈ పాట‌కు అనిరుధ్ అద్భుత‌మైన ట్యూన్ ని అందించారు. అర‌బిక్ స్టైల్ లో పాట ఆద్యంతం ఎంతో ఎన‌ర్జిటిక్ గా క‌నిపిస్తుంది.

ఇళయద‌ళ‌పతి విజయ్ చిత్రం `బీస్ట్` నుండి `అరబిక్ కుత్తు` ఈ సంవత్సరం అతిపెద్ద వైరల్ పాటలలో ఒకటిగా నిలిచింది. ఈ ట్రాక్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల నుండి గొప్ప‌ స్పందన లభించింది. వీడియో సాంగ్ లో విజయ్ -పూజా హెగ్డేల స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ మ్యాజిక్ చేశాయి.

జానీ మాస్టర్ కొరియోగ్రఫీని ప్రేక్షకులు విపరీతంగా మెచ్చుకున్నారు. అనేక వీడియో షేరింగ్ వెబ్ సైట్ లలో విజయ్ మద్దతుదారులు నృత్యకారులు చాలా మంది మ్యూజిక్ వీడియోను పునఃసృష్టించారు. వారి ఆనందాన్ని సెల‌బ్రేట్ చేసారు. తాజాగా ఈ పాట కోసం విజ‌య్ అభిమాని సృష్టించిన వీడియో వాట‌న్నిటికంటే గొప్ప ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

నిజానికి ఒరిజిన‌ల్ వీడియోతో పోల్చినప్పుడు ఈ ఫ్యాన్ మేడ్ వెర్షన్ లోని నృత్య ప్రదర్శనలు నిస్సందేహంగా అత్యుత్త‌మంగా ఉన్నాయి. ఫ్యాన్ మేడ్ వెర్షన్ లో లీడ్ డ్యాన్సర్లు విజయ్ ఒరిజినల్ లో చేసిన దానికంటే జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి పూర్తి న్యాయం చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే ఫ్యాన్ మేడ్ వెర్షన్ అసలు డ్యాన్స్ వీడియోను పూర్తిగా డామినేట్ చేసిందని చెప్పాలి. ఈ అభిమాని సృష్టించిన వీడియో తుఫాన్ వేగంతో ఎలా దూసుకెళుతోందో ఇంటర్నెట్ మాట్లాడుతోంది. ప్రజలు ఆ యువ‌కుడి స్టెప్పుల‌కు ఫిదా అయిపోతున్నారు. తమ ప్రేమతో ముంచెత్తుతున్నారు.