Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: 'బీస్ట్' గా వస్తున్న ఇళయ దళపతి..!

By:  Tupaki Desk   |   21 Jun 2021 2:30 PM GMT
ఫస్ట్ లుక్: బీస్ట్ గా వస్తున్న ఇళయ దళపతి..!
X
కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్‌ ప్రస్తుతం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు (జులై 22) పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక రోజు ముందే తన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు విజయ్. #thalapathy65 చిత్రానికి సంబంధించిన టైటిల్‌ మరియు ఫస్ట్ లుక్‌ ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

విజయ్ కొత్త చిత్రానికి ''BEAST'' (బీస్ట్) అనే ఇంగ్లీష్ టైటిల్‌ ని ఖరారు చేశారు. 'మృగం' అనే అర్థం వచ్చే టైటిల్ ను ఫిక్స్ చేసిన మేకర్స్.. ఫస్ట్ లుక్ లో విజయ్ ని ఒక షార్ప్ షూటర్ అనుకునేలా చూపించారు. దట్టమైన పొగల మధ్య చేతిలో గన్‌ పట్టుకుని విజయ్ స్టైలిష్ గా నిలబడి ఉన్నాడు. ఇందులో విజయ్‌ బనియన్‌ ధరించి ఉండటం గమనార్హం. ఈ చిత్రంలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఫస్ట్ లుక్ లోనే హింట్ ఇచ్చారు. దీనికి అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది.

'బీస్ట్' చిత్రంలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆర్.నిర్మల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అన్బు-అరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండగా.. జానీ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సన్‌ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్వరలోనే 'బీస్ట్' తదుపరి షెడ్యూల్ షూట్ ప్రారంభం కానుంది.