Begin typing your search above and press return to search.
హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ పక్కానా?
By: Tupaki Desk | 25 Oct 2020 7:00 AM ISTమరి కొద్ది నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. మరోసారి అధికారం దక్కించుకోవాలని పళని స్వామి అండ్ టీం ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు, జైలునుంచి విడుదల కాబోతోన్న శశికళ...దినకరన్ తో కలిసి తమిళనాట చక్రం తిపపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్, ఇవ్వబోతున్నట్లు హింట్ ఇస్తోన్న రజనీకాంత్ తమిళ రాజకీయాల్లో కొత్త ఒరవడి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన పొలిటికల్ ఎంట్రీపై విజయ్ త్వరలో క్లారిటీ ఇస్తారని, ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జిల్లాల వారీగా అభిమాన సంఘాలతో విజయ్ భేటీ అవుతున్నారని టాక్ వస్తోంది.
దక్షిణ తమిళనాడులోని మధురై, దిండిగల్, తిరునల్వేలితో సహా పలు జిల్లాల్లో అభిమాన సంఘాల అధ్యక్షులతో విజయ్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ సర్వత్రా చర్చనీయాంశమైంది. మరో వారం రోజుల పాటు విజయ్ వరుస భేటీలు జరగనున్నట్లు తెలుస్తోంది.కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ , విజయ్ లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘మక్కల్ ఇయక్కమ్’ పేరుతో విజయ్ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనినే పార్టీగా మార్చే యోచలనలో విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే,విజయ్ పార్టీ పెడతారా? ఒకవేళ పెడితే రాబోయే ఎన్నికల్లో విజయ్ పోటీ చేస్తారా..? లేక ఏదైనా పార్టీకి మద్దతిస్తారా అన్న చర్చ తమిళనాట జోరుగా జరుగుతోంది. కాగా, రజనీకాంత్ కు బీజేపీ నేతలు గాలం వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు, రజనీ సింగిల్ గానే బరిలోకి దిగుతారని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.