Begin typing your search above and press return to search.

పైడిపల్లికి మరో ఛాన్స్ ఇస్తున్న స్టార్ హీరో

By:  Tupaki Desk   |   7 Feb 2023 8:00 AM GMT
పైడిపల్లికి మరో ఛాన్స్ ఇస్తున్న స్టార్ హీరో
X
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన వారిసు మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాత దిల్ రాజుకి కూడా ఈ సినిమా భారీగా ప్రాఫిట్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ చాలా కాలం తర్వాత ఒక ఫ్యామిలీ మెన్ గా కనిపించాడు.

దీంతో తమిళంలో కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా కుటుంబ కథలు ఇష్టపడే ప్రేక్షకులు కూడా వారిసు సినిమా చూశారు. దీంతో లాంగ్ రాన్ లో 300 కోట్ల కలెక్షన్స్ గ్రాస్ ని వారిసు అందుకుంది. ఇదిలా ఉంటే విజయ్ మరో ఛాన్స్ వంశీ పైడిపల్లికి ఇచ్చినట్లుగా కోలీవుడ్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పవర్ ఫుల్ మాస్ కథాంశంతో లియో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో విజయ్ కి జోడిగా త్రిష నటించబోతుంది.దీని తర్వాత విజయ్ 68వ సినిమాని అత్లీ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత విజయ్ 69వ సినిమాని మరల వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తాడా లేదంటే కోలీవుడ్ నిర్మాతలు నిర్మిస్తారా అనేది వేచి చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ తో కూడా వంశీ పైడిపల్లి సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ నేపథ్యంలో వారు కూడా విజయ్ సినిమా నిర్మించే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వీటిలో ఏ ప్రొడక్షన్ హౌస్ లో వంశీ పైడిపల్లి విజయ్ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది అనేది వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.