Begin typing your search above and press return to search.

తెలుగు లో సక్సెస్ కోసం సూపర్‌ స్టార్‌ ప్రయోగం

By:  Tupaki Desk   |   24 Jan 2022 1:30 AM GMT
తెలుగు లో సక్సెస్ కోసం సూపర్‌ స్టార్‌ ప్రయోగం
X
తమిళ సూపర్‌ స్టార్ విజయ్ తెలుగు లో సక్సెస్ ను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. గత దశాబ్ద కాలంగా ఆయన నటించిన పలు సినిమాలు తెలుగు లో విడుదల అయ్యాయి. కాని అందులో ఒకటి రెండు మాత్రమే పర్వాలేదు అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు దక్కించుకున్నాయి. ఇతర తమిళ హీరోలు పదుల కోట్ల వసూళ్లు దక్కించుకుంటూ ఇక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ను దక్కించుకుంటూ ఉంటే విజయ్ మాత్రం పెద్దగా విజయాలను దక్కించుకోలేక పోతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన తెలుగు లో ప్రస్తుతం చేస్తున్న బీస్ట్‌ సినిమా తో విజయాన్ని దక్కించుకునేందుకు ప్రయోగంను చేసేందుకు సిద్దం అయ్యాడు. తమిళంలో విపరీతమైన బజ్ ఉన్న బీస్ట్ సినిమా ను తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.

తమిళ క్రేజీ డైరెక్టర్‌ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందుతున్న బీస్ట్‌ సినిమాను భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో దిల్‌ రాజు విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది. బీస్ట్ సినిమా తెలుగు వర్షన్ తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్‌ ను చెప్పేందుకు విజయ్ సిద్దం అయ్యాడని వార్తలు వస్తున్నాయి. విజయ్ తెలుగు చక్కగా మాట్లాడగలడు. అందుకే ఆయనతో డబ్బింగ్‌ చెప్పిస్తే బాగుంటుందని భావించారట. అందుకు ఆయన కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. బీస్ట్‌ తర్వాత ఎలాగూ తెలుగు సినిమా ను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కనుక బీస్ట్ కు డబ్బింగ్‌ చెప్పడం వల్ల ప్రయోగం చేసినట్లుగా అవుతుంది.. తద్వార తదుపరి సినిమా కు మంచి ఫలితం దక్కుతుందని భావిస్తున్నారు.

బీస్ట్‌ సినిమా ను తెలుగు లో ప్రయోగాత్మకంగా సొంత డబ్బింగ్ తో విడుదల చేయడం మాత్రమే కాకుండా గత చిత్రాల కంటే విభిన్నంగా ఈ సినిమా ను ప్రమోట్‌ చేయాలని కూడా భావిస్తున్నారు. అలా బీస్ట్‌ సినిమా తో తెలుగు లో మొదటి సక్సెస్‌ ను విజయ్ దక్కించుకునేలా ప్లాన్‌ చేస్తున్నారు. బీస్ట్‌ సినిమా లో హీరోయిన్‌ గా టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే నటించడం వల్ల కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు లో ఎక్కువ పోటీ లేని సమయంలో బీస్ట్‌ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కరోనా థర్డ్‌ వేవ్‌ కారణంగా సినిమా ను వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.