Begin typing your search above and press return to search.
'టక్ జగదీష్' ని ఢీ కొడుతున్న 'తలైవి'
By: Tupaki Desk | 25 Feb 2021 12:41 PM ISTతమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమా 'తలైవి - ది రివల్యూషనరీ లీడర్'. తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి - శైలేష్ ఆర్ సింగ్ కలిసి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అయితే ఆల్రెడీ ఆ డేట్ ని 'టక్ జగదీష్' లాక్ చేసిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
నేచురల్ స్టార్ నాని - డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందుతున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ''టక్ జగదీష్''. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అదే రోజు నాగచైతన్య 'లవ్ స్టోరీ' విడుదల ఉండటంతో పరస్పర అంగీకారంతో 'టక్ జగదీష్' ను ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఇప్పుడు కంగనా 'తలైవి' చిత్రాన్ని అదే రోజు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో 'టక్ జగదీష్' కి పోటీ అనివార్యమైంది. ఇకపోతే సైఫ్ అలీఖాన్ - రాణీ ముఖర్జీ జంటగా నటించిన 'బంటీ ఔర్ బబ్లీ 2' అనే హిందీ సినిమా కూడా ఏప్రిల్ 23నే రిలీజ్ కానుంది. ఇలా బాక్సాఫీస్ వద్ద ఈ మూడు చిత్రాలకు పోటీ జరగనుంది. నిజానికి ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది చాలా సినిమాలకు రిలీజ్ డేట్స్ విషయంలో క్లాష్ ఏర్పడుతోంది.