Begin typing your search above and press return to search.

#త‌లైవి.. బై చెబుతూ ఎమోష‌న్ కి గురైన కంగ‌న‌

By:  Tupaki Desk   |   12 Dec 2020 11:23 PM IST
#త‌లైవి.. బై చెబుతూ ఎమోష‌న్ కి గురైన కంగ‌న‌
X
క్వీన్ కంగ‌న ర‌నౌత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వివాదాలు స‌ద్దుమ‌ణిగితే షూటింగుల్లో జాయిన్ అవుతోంది. ప్ర‌స్తుతం ‘అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్’ `తలైవి`ని శ‌ర‌వేగంగా పూర్తి చేయాల‌న్న త‌ప‌న‌తో ప‌ని చేస్తోంద‌ట‌.

కంగన రనౌత్ తలైవిలో రాజకీయ నాయకురాలిగా మారిన క‌థానాయిక‌ జయలలిత పాత్రలో నటిస్తున్నారు. అమ్మ జయలలిత బయోపిక్ -తలైవి చిత్రీకరణను పూర్త‌యింది. శనివారం ట్విట్టర్ ద్వారా ఈ సంగ‌తిని వెల్ల‌డించింది కంగ‌న‌. నామమాత్రపు పాత్ర అయినా దాని నుంచి విడివ‌డి బ‌య‌టికి రావ‌డం మిశ్ర‌మ భావాల క‌ల‌బోత అంటూ ఎమోష‌న్ కి గురైంది కంగ‌న‌. నాయ‌కురాలిగా కంగ‌న గెట‌ప్ అచ్చు గుద్దిన‌ట్టు జెరాక్స్ నే త‌ల‌పిస్తోంది తాజా ఫోటోలో.

``అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తలైవి` నుంచి విప్లవాత్మక నాయకురాలి పాత్ర‌ చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేశామ‌``ని కంగ‌న తెలిపారు. ``అరుదుగా ఒక నటి లేదా న‌టుడ ర‌క్త‌మాంసాల‌తో సజీవంగా క‌నిపించే పాత్ర‌లో క‌నిపిస్తాం. నేను దీనికోసం చాలా కష్టపడ్డాను. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా `బై` చెప్పే సమయం వ‌చ్చింది`` అని ఎమోష‌న్ కి గురైంది. ఇలాంటి ఒక మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కనిర్మాత‌లు ఎ.ఎల్.విజ‌య్.. శైలేష్ .. విష్ణు .. బృందా ప్ర‌సాద్ ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు కంగ‌న‌. ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించిన త‌లైవిలో ప్రకాష్ రాజ్- అరవింద్ స్వామి- భాగ్యశ్రీ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.