Begin typing your search above and press return to search.
ఫస్ట్ లుక్: తల.. ఇరగదీశాడంతే
By: Tupaki Desk | 24 Sept 2015 12:52 AM ISTతమిళ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ మూవీకి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇది అజిత్ 56వ చిత్రం. ఈ మూవీకి వేదలమ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు యూనిట్ వెల్లడించింది. కోలీవుడ్ లో పెద్ద పండుగ దీపావళికి వేదలమ్ ను రిలీజ్ చేయనున్నారు. అజిత్ మూవీకి వేదలం టైటిల్ పై ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. వారం అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నా.. చివరకు పవర్ ఫుల్ గా ఉంటుందని వేదలమ్ కే మొగ్గు చూపారు.
మాస్ హీరో అజిత్ మూవీకి వేదలమ్ పేరు కూడా అంతే క్యాచీగా ఉందంటున్నారు నెటిజన్లు. నిజానికి వినాయక చవితి పండుగకే టైటిల్ ప్రకటించి, ఫస్ట్ లుక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు అజిత్. కానీ అదే రోజున రజినీకాంత్ కబాలి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో.. అజిత్ వెనక్కుతగ్గాడు. అభిమానులు నిరుత్సాహపడ్డా.. రజినీకి పోటీగా వెళ్లకూడదని భావించాడు అజిత్.
అజిత్ కొన్నాళ్లుగా నడివయసు కేరక్టర్లనే చేస్తున్నాడు. వేదాలమ్ లో కూడా అదే తరహా రోల్ చేస్తున్నా.. రెడ్ కలర్ డ్రస్, తెల్ల గడ్డం, నెరిసిన జుట్టుతో ఇచ్చిన ఫస్ట్ లుక్ లో అజిత్ సూపర్ గా ఉన్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ దిట్టంగా ఈ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంది. అజిత్ చెల్లెలుగా లక్ష్మీ మీనన్ నటిస్తున్న వేదలమ్ లో.. శృతిహాసన్ హీరోయిన్. ఆఖరిగా చెప్పాలంటే.. 'తల' అజిత్ ఇగరదీశాడంతే.