Begin typing your search above and press return to search.

కొత్త రేసింగ్ బైక్ పై తళా అజిత్ దుమ్ము దుమారం..!

By:  Tupaki Desk   |   22 July 2021 3:30 PM GMT
కొత్త రేసింగ్ బైక్ పై తళా అజిత్ దుమ్ము దుమారం..!
X
త‌ళా అజిత్ అంటేనే రేసింగ్.. రేసింగ్ అంటేనే త‌ళా అజిత్! అంత‌గా ఈ త‌మిళ స్టార్ హీరో పాపుల‌ర‌య్యారు. కార్ రేసింగ్.. బైక్ రేసింగ్.. షూటింగ్.. ఫోటోగ్రఫీ.. ఏరోమోడలింగ్ వంటి అనేక అభిరుచులు ప్రజలకు తెలుసు. త‌న కెరీర్ మొద‌లైందే రేస‌ర్ గా క్రీడాకారుడిగా.. అత‌డి వ్య‌క్తిత్వంలో నైజంలో స్పోర్ట్స్ ఒక భాగం. ఒక స్టార్ గా స్ఫూర్తిదాయకమైన స్వీయనిర్మిత స్టార్ గా అజిత్ అసాధార‌ణ వ్య‌క్తిగా అభిమానుల గుండెల్లో నిలిచారు. కోలీవుడ్ లోనే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అంత‌టి అపారమైన అభిమాన బ‌లం క‌లిగిన స్టార్ గా అత‌డు సుపరిచితుడు. అజిత్ ఎంతో లైక్ చేసే బైక్ రైడింగ్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ అంతటా వైరల్ అవుతున్నాయి. అజిత్ ఆఫ్ ద‌ స్క్రీన్ రేసింగ్ ని చూశాక‌ అభిమానులు స‌ర్ ప్రైజ్ ట్రీట్ గా భావిస్తున్నారు.

తాజాగా అజిత్ బైక్ రేసింగ్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాల‌లో సునామీలా మారాయి. త‌ళా స్పోర్ట్స్ బైక్ లను విప‌రీతంగా అభిమానిస్తారు.. ప్రేమిస్తారు.. ట్రాక్ పై తుఫాన్ వేగంతో దూసుకుపోవ‌డం అత‌డికి కొత్తేమీ కాదు. తాజాగా BMW R1200 GS బైక్ పై కిల్ల‌ర్ లుక్ తో క‌నిపిస్తున్న ఫోటోని అజిత్ షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. బ్లాక్ క‌ల‌ర్ మోటారు సైకిల్ రక్షణ సూట్ ధరించి చెన్నై శివార్లలో ప్రయాణించారు. ఇక ఇలాంటి ఫీట్స్ ని త‌న సినిమాల్లో చూపించేందుకు అజిత్ ఎంతో ఆస‌క్తిగా ఉంటారు.

అజిత్ న‌టిస్తున్న తాజా చిత్రం `వాలిమై`లో బైక్ సంబంధిత స్టంట్స్ ఓ రేంజులో ఉంటాయ‌న్న స‌మాచారం ఉంది. `వాలిమై` చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించనున్నారు. ఈ యాక్షన్ డ్రామాలో హ్యూమా ఖురేషి- కార్తికేయ ముఖ్య పాత్రల్లో నటించారు.

త‌మిళ నాట ఫ్యాన్స్ వీరంగం:

త‌ళా అజిత్ ఓ సినిమాలో న‌టిస్తున్నారు అంటే దానిపై అభిమానుల్లో ఎంతో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంటుంది. అత‌డి గెట‌ప్ ఎంపిక చేసుకున్న పాత్ర.. న‌ట‌న.. ఆహార్యం.. యాక్ష‌న్ ప్ర‌తిదీ చ‌ర్చే. అత‌డు న‌టించిన పింక్ రీమేక్ `నేర్కొండ పార్వై` పెద్ద విజ‌యం అందుకుంది. ప్ర‌స్తుతం అజిత్ వాలిమై లో త‌ళా పోలీస్ అధికారిగా న‌టిస్తున్నారు. నేర్కండ పార్వై నిర్మాత‌ బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాలిమై అధికారిక మోషన్ పోస్టర్ అభిమానుల్లోకి వైర‌ల్ గా దూసుకెళ్లింది. నిర్మాత బోనీ కపూర్ పంచుకున్న మోషన్ పోస్టర్ అజిత్ అభిమానులు ఊహించ‌నంత పదునైనది.. వేగవంతమైనది..`శక్తి మనస్సు స్థితి` అన్న ట్యాగ్ తో పోస్ట‌ర్ వైర‌ల్ అయ్యింది. కాప్ పాత్ర‌లో అజిత్ ఎంతో స్టైలిష్ అవతారంలో క‌నిపిస్తున్నారు. ఇక ఇందులో బైక్ రేస‌ర్ త‌ర‌హాలో అజిత్ దుమారం ఓ రేంజులో ఎలివేట్ చేశారు. కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన గెట‌ప్పుల్లో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన అజిత్ ఈసారి వాలిమైలో అంత‌కుమించి ఛాలెంజింగ్ పాత్ర‌తో మైమ‌రిపించ‌నున్నారు.