Begin typing your search above and press return to search.

మహిళా అభిమానుల కోసం స్పెషల్ షో

By:  Tupaki Desk   |   14 Dec 2017 12:30 PM GMT
మహిళా అభిమానుల కోసం స్పెషల్ షో
X
కోలీవుడ్ హీరోలకు అభిమానులు ఉన్నట్టుగా ఎవరికీ ఉండరేమో అని చెప్పాలి. అక్కడి స్టార్ హీరోలు అభిమానులను దృష్టిలో ఉంచుకొని చాలా వరకు వారికి నచ్చినట్టుగా సినిమాలను చేస్తుంటారు. దీంతో అభిమానులు వారిని చాలా ఇష్టపడుతుంటారు. అయితే అక్కడి స్టార్ హీరోల్లో ఒకరైన సూర్యకి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్పెషల్ గా చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. సూర్యని లేడీస్ కూడా చాలా ఇష్టపడతారు.

అంతే కాకూండా లేడీస్ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా సూర్యకి ఉండడం మరో స్పెషల్. సూర్య నటించిన లేటెస్ట్ సినిమా థానా సెర్ధా కూటమ్ అనే సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా తెలుగులో గ్యాంగ్ అనే పేరుతో రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంత చేసుకుంది. దీంతో లేడీస్ ఫ్యాన్స్ చాలా హంగామా చేశారు. కొన్ని ప్రాంతాల్లో గ్రూపులుగా ఏర్పడ్డారు. అయితే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఎప్పుడు ఏ హీరో చేయని విధంగా సూర్య లేడీస్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు.

కేరళలో లోని త్రివన్రుమ్ లో మొట్ట మొదటిసారి లేడీస్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోని వేయనున్నారు. అందుకోసం నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది.