Begin typing your search above and press return to search.

#క‌రోనా సాయం: 24 క్రాఫ్టుల్లో కార్మికుల లెక్క తేలేదెలా?

By:  Tupaki Desk   |   29 March 2020 10:29 AM GMT
#క‌రోనా సాయం: 24 క్రాఫ్టుల్లో కార్మికుల లెక్క తేలేదెలా?
X
క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో సినీకార్మికుల ప‌రిస్థితి మ‌రీ ద‌య‌నీయంగా ఉంద‌న్న స‌మాచారం ఉంది. ముఖ్యంగా రోజువారీ భ‌త్యంపై ప‌ని చేసే కార్మికులు వేల‌ల్లో ఉన్నార‌న్న అంచ‌నా ఉంది. ఈ నేప‌థ్యంలో సినీ పెద్ద‌లు స‌హా కార్మిక సంఘాల నేత‌లు దీనిపై సీరియ‌స్ గా ఆలోచించి ఓ క‌మిటీని ఏర్పాటు చేసారు. సీసీసీ ఫండ్ పేరుతో కార్మికుల‌కు నిత్యావ‌స‌రాల పంపిణీ విష‌య‌మై చ‌ర్చించారు. మెగాస్టార్ చిరంజీవి అధ్య‌క్ష‌త‌న న‌డుస్తున్న ఈ చారిటీ సేవ‌లు అవ‌స‌రార్థుల‌ను క‌ష్టాల్లో ఉన్న నిరుపేద కార్మికుల్ని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన‌ది.

క‌రోనా నేప‌థ్యంలో మ‌రో రెండు మూడు నెల‌ల పాటు ఇదే స‌న్నివేశం ఉండేట్టు క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో భ‌త్యం లేక ఇబ్బంది ప‌డే వారిని ఆదుకునేందుకు త‌క్ష‌ణ సాయం చేయాల‌ని ప్ర‌తిపాదించారు. ఇంట్లో ముగ్గురు ఉంటే ఆ కుటుంబానికి నిత్యావ‌స‌రాల కోసం రూ.3వేల వ‌ర‌కూ ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా వేసారు. ఇక ఇప్ప‌టివ‌ర‌కూ ఓ 1000 మంది కార్మికుల‌కు సాయం చేయాల‌న్న ఆలోచ‌న చేశారు. ఇక జీతం అందుకునే కార్మికుల‌ను మిన‌హాయించాల‌ని ఈ సంద‌ర్భంగా భావిస్తున్నారు.

చిరంజీవి- కార్మిక నాయ‌కుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స‌హా చిత్ర‌పురి అధ్య‌క్షుడు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు దీనిపై చ‌ర్చించారు. ఇక 24 క్రాఫ్టుల్లో వేలాది మంది కార్మికులు ఉన్నారు. వీరిలో పొట్ట‌కూటికి ఇబ్బంది ప‌డేవారు ఎంద‌రు? అన్న దానిపై పూర్తి స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉందింకా. ఇక‌పోతే ఇలాంటి స‌మ‌యంలో పెద్ద‌న్న సాయం కోసం చాలా మంది కార్మికులు ఎదురు చూస్తున్నారు. దీనిపై జూనియ‌ర్ ఆర్టిస్టుల సంఘం స‌హా 24 శాఖ‌ల కార్మికుల వాట్సాప్ గ్రూపుల్లో చ‌ర్చ సాగుతోంది. సాయం త‌మ వ‌ర‌కూ అందాల‌ని అంతా కోరుతున్నారు. అయితే ప్ర‌స్తుత క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణంలో నిత్యావ‌స‌రాలు ఆప‌న్నుల‌కు చేరాలంటే అందుకు పోలీసుల సాయం అవ‌స‌రం అవుతుంద‌ని ఆ మేర‌కు సినీ పెద్ద‌లు ప్ర‌భుత్వం- పెద్ద‌ల‌ను సంప్ర‌దించార‌ని తెలుస్తోంది. ఇక థియేటర్ కార్మికులను నిత్యావ‌స‌రాల సాయం జాబితాలో చేర్చాల‌న్న డిమాండ్ ఇప్ప‌టికే ఉంది.

సాయం అందే నిత్యావ‌స‌రాలివే..

1) .రైస్ 25 కిలోలు
2). వంట నూనె 1 లీటరు
3) .కారం 200 గ్రా
4) .పసుపు 100 గ్రా
5) .ధ‌నియా పౌడర్ 100 గ్రా
6) .జీల కర్ర‌ 50 గ్రా
7) .ఆవలు 50 గ్రాములు
8) .కంది పప్పు 2 కిలోలు
9) .మినప పప్పు 2 కిలోలు
10) .వేరు సెనగ 1/2 కిలోలు
11) .పుట్నాల పప్పు 1/2 కిలోలు
12) .సుగర్ 1 కిలో
13) .టీ పౌడర్ 250 గ్రాములు
14) .ఇడ్లీ రవ్వ‌ 2 కిలోలు
15). బొంబాయి రావా 2 కిలోలు
16). ఉల్లిపాయలు 3 కిలోలు
17) .చింతపాండు 1/2 కిలోలు
18). 250 గ్రాముల సర్ఫ్
19). బాత్ సబ్బులు 5
20). టూత్ పేస్ట్ 200 గ్రాములు
21) .డిష్ వాష్ బార్ 250 గ్రాములు
22) గోధుమ‌ పిండి 2 కేజీ
23) ఉప్పు 1 కేజీ
24) హ్యాండ్-వాష్ డెటాల్