Begin typing your search above and press return to search.

కోస్టార్ కి పీసీ ఘాటైన లిప్ కిస్.. నిక్ త‌ట్టుకోగ‌ల‌డా?

By:  Tupaki Desk   |   16 Dec 2020 2:32 PM GMT
కోస్టార్ కి పీసీ ఘాటైన లిప్ కిస్.. నిక్ త‌ట్టుకోగ‌ల‌డా?
X
ఈ నెల ప్రారంభంలో నిక్ జోనాస్ తో తన రెండేళ్ల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా. అంతేకాదు.. త‌దుప‌రి ఓ హాలీవుడ్ చిత్రంలో అతనితో కలిసి పనిచేస్తున్నాన‌ని వెల్ల‌డించింది.

ఇక భ‌ర్త ఉన్న‌ప్పుడే త‌న క‌ళ్ల ముందే ప్రియాంక చోప్రా సహ నటుడు సామ్ హ్యూఘన్ తో పెదవులు లాక్ చేయడం సంచ‌ల‌న‌మే అయ్యింది. రొమాంటిక్ డ్రామా `టెక్స్ట్ ఫర్ యు` కోసం బ్యాక్ టు బ్యాక్ లిప్ లాక్ ల‌తో బోలెడంత‌ ఫుటేజ్ ను చిత్రీకరించడం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

38 ఏళ్ల పీసీ 40 ఏళ్ల స‌హ‌న‌టుడితో ఒక ఘాటైన పెద‌వి ముద్దును షేర్ చేసుకుంది. అత‌డి భుజంపై చేయి వేసి ఆరాధ‌నా భావంతో చూస్తూ పెద‌వి ముద్దు లాగించేసింది. ఆ సన్నివేశంలో అతను ఆమెను దగ్గరగా పొదివి పట్టుకున్నాడు. అయితే దీనికి అభిమానుల నుంచి కామెంట్లు హోరెత్తాయి. `నిక్ దూరంగా ఉండి చూడండి!` అంటూ వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు.

ఒక యువతి తన కాబోయే భర్త విషాదంలో ఉన్న‌ప్పుడు నష్టం వ‌ల్ల దుఃఖిస్తున్నందున అతని ఫోన్ నంబర్ ‌కు శృంగార సందేశాలను పంపాలని నిర్ణయించుకున్నప్పుడు టెక్స్ట్ కోసం స‌న్నివేశ‌మిది. ఎఫైర్స్ నేప‌థ్యంలో సిరీస్ ఇది.