Begin typing your search above and press return to search.

మ‌జిలీ ద‌ర్శ‌కుడిలో టెన్ష‌న్ టెన్ష‌న్

By:  Tupaki Desk   |   25 May 2019 8:00 PM IST
మ‌జిలీ ద‌ర్శ‌కుడిలో టెన్ష‌న్ టెన్ష‌న్
X
సెన్సిబిలిటీస్ ఉన్న కంటెంట్ ని ఎంచుకుని రైట‌ర్ కం డైరెక్ట‌ర్ గా దూసుకొచ్చాడు శివ నిర్వాణ‌. నిన్నుకోరి.. మ‌జిలీ చిత్రాల‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. తొలి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించినంత పెద్ద హిట్ట‌వ్వ‌క‌పోయినా ద‌ర్శ‌కర‌చ‌యిత‌గా అత‌డిలోని సెన్సిబిలిటీస్ కి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. `మ‌జిలీ` చిత్రంతో ఏకంగా నాగ‌చైత‌న్య‌- సమంత జంట‌కు కెరీర్ బెస్ట్ హిట్ ని ఇచ్చాడు. అక్కినేని కాంపౌండ్ లో `మ‌నం` త‌ర్వాత మ‌ళ్లీ అంత పెద్ద సంతృప్తిక‌ర‌మైన హిట్ మ‌జిలీనే అన్న మాటా వినిపించింది.

అదేగాక ఒరిజిన‌ల్ కంటెంట్ తో సినిమాలు తీసేవాళ్లు క‌రువైన ఈ రోజుల్లో శివ నిర్వాణ ప‌క్కా ఒరిజిన‌ల్ కంటెంట్ తో మ‌జిలీ సినిమాని తీశాడ‌ని పేరొచ్చింది. ఫ్యామిలీ ఎమోష‌న్స్.. సెంటిమెంట్.. క్రికెట్ నేప‌థ్యం ఇవ‌న్నీ కొత్త‌గా అనిపించాయ‌ని ప్రేక్ష‌కులు.. క్రిటిక్స్ ప్ర‌శంసించారు. రైట‌ర్ గానూ చ‌క్క‌ని సంభాష‌ణ‌ల‌తో శివ త‌న మార్క్ చూపించాడు మ‌జిలీలో. అందుకే ఇవ‌న్నీ నిజంగానే ఈ న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడికి కెరీర్ ప‌రంగా పెద్ద ప్ల‌స్ కానున్నాయి. ద్వితీయ విఘ్నం అధిగ‌మించి హిట్ కొట్టిన శివ నిర్వాణ తెర‌కెక్కించే మూడో సినిమా ఎవ‌రితో.. ఎలాంటి క‌థ‌ను రెడీ చేస్తున్నాడు? అంటూ అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు.

శివ నిర్వాణ‌కు రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థ రాసుకోమ‌ని ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చారం సాగింది. అలాగే నేచుర‌ల్ స్టార్ నాని త‌న ఫేవ‌రెట్ హీరో. అసిస్టెంట్ గా ఉన్న‌ప్పుడే త‌న‌కోసం క‌థ‌లు రాసుకున్నాన‌ని తెలిపాడు. అందుకే ఆ ఇద్ద‌రిలో ఈసారి శివ ఎవ‌రితో ప‌ని చేస్తున్నారు? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది. అత‌డు ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నుల్లో బిజీబిజీగా ఉన్నాడు. ర‌చ‌యిత‌ల బృందంతో ఓవైపు స్టోరి సిట్టింగుల్లో శివ ఎంతో టెన్ష‌న్ గా ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఇంత‌కీ ఈ క‌థ దేవ‌ర‌కొండ కోస‌మేనా? లేక ఇంకెవ‌రైనా హీరో కోస‌మా? అన్న‌ది అత‌డి నుంచే స‌మాధానం రావాల్సి ఉందింకా. బీఈడీ చ‌దివి- ఎమ్మెస్పీ పూర్తి చేసి అటుపై టీచ‌ర్ గా రెండేళ్లు ప‌ని చేసి డైరెక్ట‌ర్ అయ్యారు శివ నిర్వాణ‌. ఎడ్యుకేష‌న్ పెద్ద స్థాయిలో అయ్యాక కూడా ప‌దేళ్ల పాటు ద‌ర్శ‌కుడ‌వ్వాల‌న్న త‌ప‌న‌తో స్ట్ర‌గుల్స్ ని ఫేస్ చేశాడు. నిన్నుకోరి త‌ర్వాత రెండేళ్ల పాటు వేచి చూశాడు. మ‌జిలీ క‌థ‌ను ఓకే చేయించుకుని దాంతో పెద్ద హిట్టు కొట్టి ఇప్పుడు మూడో సినిమాతో ద‌ర్శ‌కుడిగా నెక్ట్స్ లెవ‌ల్ కోసం ట్రై చేస్తున్నాడు. అందుకే హ్యాట్రిక్ కొట్టాల‌న్న‌ టెన్ష‌న్ లో ఉన్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.