Begin typing your search above and press return to search.

#పోస్ట్ పోన్.. సెకండ్ వేవ్ తో బాలీవుడ్ లో టెన్ష‌న్

By:  Tupaki Desk   |   6 April 2021 5:37 AM GMT
#పోస్ట్ పోన్.. సెకండ్ వేవ్ తో బాలీవుడ్ లో టెన్ష‌న్
X
సెకండ్ వేవ్ టెన్ష‌న్స్ బాలీవుడ్ ని నిలవ‌నీయ‌డం లేదు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం థియేట‌ర్లు.. మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్ల విష‌యంలో విధించిన ఆంక్ష‌ల‌తో ఇప్పుడు వ‌రుస‌గా బాలీవుడ్ సినిమాల వాయిదాలు త‌ప్ప‌ద‌ని విశ్లేషిస్తున్నారు. ఇప్ప‌టికే అక్ష‌య్ కుమార్ - రోహిత్ శెట్టి కాంబినేష‌న్ లో రూపొందిన సూర్య‌వంశీ ఏప్రిల్ 30న విడుద‌ల కావాల్సి ఉండ‌గా వాయిదా వేశారు.

ఇప్పుడు ఇదే బాల‌లో ఇత‌ర సినిమాలు కూడా వాయిదా ప‌డ‌నున్నాయా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మునుముందు .. స‌ల్మాన్ -రాధే.. జాన్ అబ్ర‌హాం- సత్యమేవ జయతే.. అజ‌య్ దేవ‌గ‌న్- షంషేరా.. చెహ్రే - బంటీ B ర్ బాబ్లి 2 చిత్రాలు కూడా వాయిదా ప‌డేందుకు ఆస్కారం ఉంద‌ని విశ్లేషిస్తున్నారు. అస‌లింత‌కీ బాలీవుడ్ లో ఏం జ‌రుగుతోంది? అన్న‌ది చూస్తే.. ఎన్నో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి.

పెరుగుతున్న కొరోనావైరస్ కేసుల తో సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో ముఖ్యంగా రికార్డు స్థాయిలో కేసులు న‌మోద‌వ్వ‌డంతో రాష్ట్ర ప్రభుత్వం గత వారం రాత్రి 8:00 నుండి ఉదయం 7:00 గంటల వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ కొత్త నియమం ఉన్నప్పటికీ కేసులు పెరుగుతున్నందున ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ వేయాలి ప్రకటించే కఠినమైన నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నప్పుడు కూడా అటువంటి పరిస్థితులలో ఒక చిత్రాన్ని విడుదల చేయడం ఆత్మహత్యాస‌దృశమేన‌ని విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే 6గంట‌ల త‌ర్వాత షోలను ప్ర‌భుత్వం నిషేధించింది. అందువల్ల త‌దుప‌రి రావాల్సిన‌ చెహ్రే - బంటీ B ర్ బాబ్లి 2 వంటి చిత్రాలు నిరవధికంగా వాయిదా వేయడంలో ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.

లాక్ డౌన్ ప్ర‌క‌ట‌న‌తో సినిమా హాళ్ళు నెలాఖ‌రు వరకు మూసివేయడంతో సినిమా రంగం చాలా ప్రభావితమవుతోంది. కార‌ణం ఏదైనా.. సూర్యవంశీ షెడ్యూల్ ప్రకారం విడుదల కావ‌డం లేద‌ని తెలుస్తోంది. ఏప్రిల్ 30 త‌రవాతా లాక్ డౌన్ స‌డ‌లిస్తారా..అంటే చెప్ప‌లేం. లాక్ డౌన్ పొడిగించర‌ని ఎటువంటి హామీ లేదు.. ప్రత్యేకించి కేసులు తగ్గకపోతే!!

ఇతర రాష్ట్రాలు కూడా మహారాష్ట్ర ఉదాహరణను అనుసరించి ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటే అది మ‌రింత ఇబ్బంది అని భావిస్తున్నారు. సూర్యవంశీ బాలీవుడ్ లో వ‌స్తున్న అతి పెద్ద చిత్రం. ఇది అనూహ్య పరిస్థితులలో విడుదల చేస్తే ఆత్మహత్యాస‌దృశ‌మే అవుతుంది. అందువల్లనే ఇది వాయిదా పడిందని తెలిసింది.

రోహిత్ శెట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో వర్చువల్ చర్చలు జరిపాకే సూర్యవంశీని వాయిదా వేసే ధైర్యమైన కష్టమైన నిర్ణయం తీసుకున్నార‌ని.. దానిని ఉద్దవ్ ఠాక్రే ప్రశంసించార‌ని కూడా తెలిసింది.

అక్ష‌య్ అభిమానులకు.. ఎగ్జిబిటర్లకు.. పరిశ్రమకు సూర్యవంశీని వాయిదా వేయడం భారీ దెబ్బ అవుతుంది. ఇది 2021లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. మార్చి 2020 నుండి క్రైసిస్ అనంత‌రం.. భారీగా ప్రభావితమైన సినిమా వ్యాపారాన్ని పునరుత్థానం చేస్తుందని భావించిన క్రేజీ మూవీ ఇది.

నిజానికి సూర్యవంశీని మొదట 24 మార్చి 2020 న విడుదల చేయవలసి ఉంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి రావడంతో వాయిదా ప‌డింది. జూన్ 2020 లో ఈ చిత్రాన్ని దీపావళి సంద‌ర్భంగా రిలీజ్ చేయాల‌ని అనుకున్నా కుద‌ర‌లేదు. ఏదేమైనా పరిస్థితి అనుకూలంగా మార‌లేదు.

చివరగా ఫిబ్రవరి 2021లో కేంద్ర ప్రభుత్వం థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీని అనుమతించినప్పుడు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2 న తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. తరువాత కూడా మ‌రోసారి దానిని ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు. మార్చి 14న రోహిత్ శెట్టి పుట్టినరోజున.. రిలీజ్ చేయాల‌నుకున్నా కుద‌ర‌లేదు. ఇంత డైలమా ఎన్న‌డూ లేదు. ఇది బాలీవుడ్ కి ఎంతో తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితి అని విశ్లేషించాలి.