Begin typing your search above and press return to search.

సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన నిర్మాత‌ల్లో మ‌ళ్లీ టెన్ష‌న్..?

By:  Tupaki Desk   |   30 Dec 2020 9:00 AM IST
సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన నిర్మాత‌ల్లో మ‌ళ్లీ టెన్ష‌న్..?
X
కరోనా మహమ్మారి కారణంగా ఇన్నాళ్లూ సినిమా థియేటర్స్ మూతబడి ఉన్నాయి. లాక్ డౌన్ సడలింపులలో భాగంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. థియేటర్ యాజమాన్యాలు ముందుకు రాలేదు. అయితే ఇటీవలే పూర్తి స్థాయిలో సినిమా హాళ్లు రీ ఓపెన్ అవడమే కాకుండా సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేశారు. క్రిస్మస్ సందర్భంగా రిలీజైన ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. ‘సోలో బ్రతుకే..’ కి ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందనతో ఇండస్ట్రీలో ఆశలు చిగురించి చిన్న, పెద్ద సినిమాలన్నింటికీ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు కొత్త రకం కరోనా వచ్చిందనే వార్తలతో అందరిలో మళ్ళీ టెన్షన్ మొదలైందని తెలుస్తోంది.

కొత్త ఏడాదికి కొన్ని చిన్న సినిమాలు.. ఆల్రెడీ ఓటీటీలో రిలీజైన సినిమాలు థియేటర్స్ లో స్వాగతం పలకనున్నాయి. రాజ్ తరుణ్ నటించిన 'ఒరేయ్ బుజ్జిగా' డిసెంబర్ 31న వస్తుండగా.. నాని-సుధీర్ బాబు కలిసి నటించిన 'వి' చిత్రాన్ని జనవరి 1న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అలానే 'షకీలా' 'బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది' వంటి చిన్న సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. ఇక సంక్రాంతి పండక్కి మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'క్రాక్'.. రామ్ పోతినేని 'రెడ్'.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్'.. విజయ్ 'మాస్టర్' చిత్రాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చాలా సినిమాల నిర్మాతలు కేవ‌లం అడ్వాన్సులు తీసుకునే డిస్ట్రీబ్యూట‌ర్స్ కు సినిమాలు ఇవ్వ‌డానికి ముందుకు వ‌చ్చారు. ఫెస్టివల్ సీజన్ లో మంచి కలెక్షన్స్ రాబట్టవచ్చని అనుకున్న వారికి.. ఇప్పుడు మ‌ళ్లీ థియేట‌ర్స్ బంద్ అనే వార్తలు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.