Begin typing your search above and press return to search.
ఉదయభాను ఎందుకు కనిపించట్లేదో తెలుసా?
By: Tupaki Desk | 28 Aug 2016 10:14 AM ISTఇప్పుడంటే హాట్ యాంకర్ల హల్ చల్ మీడియాలో నడుస్తోంది కానీ.. ఈ ట్రెండ్ ను పదేళ్ల క్రితమే చూపించిన యాంకర్ ఉదయభాను. కాకపోతే.. హాట్ నెస్ సినిమాలకు.. యాంకరింగ్ టీవీలకు పరిమితం చేసి.. వేరియేషన్ చూపించేది. జులాయి లాంటి సినిమాల్లో ఐటెం భామగా కూడా కనిపించినా.. ఆ పాత్రలను కంటిన్యూ చేయలేదు. ఇప్పుడీ యాంకర్ చాలా కాలంగా మీడియా ముందు కనిపించడం లేదు. ఇందుకు కారణం.. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడమే.
మరో పది రోజుల్లో కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది ఉదయభాను. కన్ స్ట్రక్షన్ వ్యాపారి విజయ్ తో ఉదయభాను పెళ్లయి పదేళ్లకు పైగానే అయింది. లైఫ్ లో సెటిల్ అయ్యాక పిల్లలు అనే కాన్సెప్ట్ తో.. ఇన్నాళ్లు ఆగి.. ఇప్పుడు పిల్లలను ప్లాన్ చేసుకున్నారట. 'సీతారాముల ఫోటో చూసినప్పుడల్లా మీకిద్దరు కదా.. నాకూ ఇద్దర్ని ఇవ్వండి అని కోరుకునేదాన్ని. జంట అరటి పళ్లు.. జంట టమాటాలు.. జంట వంకాయలు కావాలని తినేదాన్ని. నేను కవలలను కోరుకున్నానని దేవతలు తథాస్తు అన్నట్లుగా ఉన్నారు' అంటూ ఆనందంగా చెబుతోంది ఉదయభాను.
ప్రెగ్నెన్సీ అని తెలినప్పటి నుంచి తను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించామని అంటున్నాడు ఉదయభాను భర్త విజయ్. నాలుగైదు నెలలు పని చేయచ్చని తెలిసినా.. ప్రశాంతంగా ఉండడం కోసం.. పూర్తి రెస్ట్ ఇవ్వాలని అనుకున్నారట. అందుకే ఎక్కడా ఉదయభాను కనిపించడం లేదు. అర్ధమైందా!