Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తి విజ‌య్ 66 తెలుగు టైటిల్ ఇదే!

By:  Tupaki Desk   |   21 Jun 2022 2:56 PM GMT
ద‌ళ‌ప‌తి విజ‌య్ 66 తెలుగు టైటిల్ ఇదే!
X
ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి డైరెక్ష‌న్ లో ఓ భారీ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, పీవీపీ బ్యాన‌ర్ ల‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు, శిరీష్‌, ప‌ర‌మ్ వి పొట్లూరి, ఎర‌ల్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో ఈ మూవీని ద్వి భాషా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు. మంగ‌ళ‌వారం హీరో విజ‌య్ ఫ‌స్ట్ లుక్ తో పాటు ఈ మూవీ టైటిల్ ని రెండు భాష‌ల్లోనూ చిత్ర బృందం ప్ర‌క‌టించి విజ‌య్ ఫ్యాన్స్ ని స‌ర్ ప్రైజ్ చేసింది.

ముందు తమిళ టైటిల్ ని `వారిసు`గా ప్ర‌క‌టించిన మేక‌ర్స్ ఆ వెంట‌నే తెలుగు టైటిల్ ని `వార‌సుడు` గా ప్ర‌క‌టించింది. కంప్లీట్ ఫ్యామిటీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న మూవీ కావ‌డంతో ఈ మూవీ క‌థానుసారం `వార‌సుడు` టైటిల్ క‌రెక్ట్ యాప్ట్ కాబ‌ట్టి ఇదే టైటిల్ ని ఫైన‌ల్ చేశారు. `ది బాస్ రిటర్న్స్` అని ట్యాగ్ టైన్‌. ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ లో స్టైలిష్ లుక్ లో క‌నిపిస్తూనే హీరో విజ‌య్ సీరియ‌స్ గా క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది.

దిల్ రాజు బ్యాన‌ర్ అంటే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ల‌కు కేరాఫ్ అడ్ర‌స్. ఇదే విష‌యాన్ని `వార‌సుడు` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్, టైటిల్ మ‌రోసారి రుజువు చేసింది. అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. `బీస్ట్‌` త‌రువాత విజ‌య్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డం, తొలి సారి తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో రూపొందుతున్న మూవీ కావ‌డంతో ఈ మూవీపై విజ‌య్ ఫ్యాన్స్ తో పాటు సినీ ల‌వ‌ర్స్ లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తాజాగా విడుద‌ల చేసిన టైటిల్ పోస్ట‌ర్ ఆ అంచ‌నాల్ని మ‌రింతగా పెంచేసింది.

విజ‌య్ కున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని యూనివ‌ర్స‌ల్ స‌బ్జెక్ట్ తో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నార‌ట‌. త‌మిళంలో `వారిసు`గా తెలుగులో `వార‌సుడు`గా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాష‌ల్లోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకోవ‌డం కాయం అని చెబుతున్నారు.

ఈ మూవీలో విజ‌య్ ని నెవ‌ర్ బిఫోర్ క్యారెక్ట‌ర్ లో ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ప్ర‌జెంట్ చేస్తున్న‌ట్టుగా ఫ‌స్ట్ లుక్ తో క్లారిటీ వ‌చ్చేసింది. భారీ నిర్మాణ విలువ‌ల‌తో అత్యంత భారీ తారాగ‌ణంతో గ్రాండీయ‌ర్ గా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌భు, శ‌ర‌త్ కుమార్‌, ప్ర‌కాష్ రాజ్ , జ‌య‌సుధ‌, శ్రీ‌కాంత్‌, కిక్ శ్యామ్‌, యోగిబాబు, సంగీత‌, సంయుక్త కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నైలో జ‌రుగుతోంది. ప్ర‌ధాన తార‌గ‌ణం పాల్గొన‌గా కీల‌క‌మైన భారీ షెడ్యూల్ ని చిత్రీక‌రిస్తున్నారు. వంశీ పైడిప‌ల్లి, అహిషోర్ సాల్మాన్‌, హ‌రి ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సంగీతం త‌మ‌న్‌, ఫొటోగ్ర‌ఫీ కార్తీక్ ప‌ళ‌ని, ఎడిటింగ్ ప్ర‌వీణ్ కె.ఎల్‌, స‌హ నిర్మాత‌లు శ్రీ‌హ‌ర్షిత్ రెడ్డి, శ్రీ‌హ‌న్షిత‌, సునీల్ బాబు, వైష్ణ‌వి రెడ్డి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ లుగా